Health: ఒళ్లు నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారా..? అయితే ఓసారి మీ వంటింటి వైపు లుక్కేయండి..

Natural Pain Killers: ఇటీవలి కాలంలో చాలా మంది నొప్పులతో బాధపడుతున్నారు. ఒక్క రోజు పని ఎక్కువయితే చాలు ఆయింట్‌ మెంట్‌లు, పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారు. అయితే వీటిని తీసుకుంటే...

Health: ఒళ్లు నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారా..? అయితే ఓసారి మీ వంటింటి వైపు లుక్కేయండి..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 12:04 AM

Natural Pain Killers: ఇటీవలి కాలంలో చాలా మంది నొప్పులతో బాధపడుతున్నారు. ఒక్క రోజు పని ఎక్కువయితే చాలు ఆయింట్‌ మెంట్‌లు, పెయిన్‌ కిల్లర్స్‌ వాడుతున్నారు. అయితే వీటిని తీసుకుంటే అప్పటికప్పుడు ఉపశమనం కలిగినా.. మళ్లీ నొప్పులు మొదలవుతాయి. అంతేకాకుండా నిత్యం పెయిన్‌ కిల్లర్‌లు తీసుకుంటే కిడ్నీలపై దుష్ఫ్రభావం కలిగే అవకాశాలుంటాయని వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. మరి ఓసారి మన వంటింటిని తరిచి చూస్తే అక్కడే ఎన్నో సహజ పెయిన్‌ కిల్లర్స్‌ కనిపిస్తాయి. మరి ఆ నేచురల్‌ పెయిన్‌ కిల్లర్స్‌పై ఓ లుక్కేద్దామా..

పసుపు..

పసుపు వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న గాయమయినా వెంటనే పసుపు పూసేస్తాం. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు పసుపులో ఎంతటి గుణాలున్నాయో. అయితే పసుపు నొప్పులకు కూడా ఒక మంచి సహజ ఔషధంలా పనిచేస్తుందని మీకు తెలుసా.? ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు కండరాలు, కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. వాపులకు కూడా పసుపు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.

పెరుగు..

మనం నిత్యం తీసుకునే పెరుగులో నొప్పులను తగ్గించే గుణాలున్నాయి. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో బాధపడే కడుపు నొప్పికి పెరుగు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగవ్వడంలో కూడా పెరుగుది కీలకపాత్ర.

అల్లం..

దాదాపు అన్ని వంటకాల్లో కచ్చితంగా ఉపయోగించే ఆహార పదార్థాల్లో అల్లం ఒకటి. దీనివల్ల కడుపు, ఛాతీ, కండరాల నొప్పులకు మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అల్లం ఛాయ్‌ తాగితే తలనొప్పి కూడా తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో కూడా రుజువైంది.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో ఉండే సహజ లక్షణాలు మంచి పెయిన్‌ కిల్లర్‌గా పనిచేస్తాయి. వెల్లులిలో యాంటీ ఫంగర్‌, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ లక్షణాలుంటాయి. దీని ద్వారా కీళ్లనొప్పులు, చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

పుదీనా..

పుదీనా కూడా మంచి పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. పుదీనాను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా.. తలనొప్పి, కండరాల నొప్పి, పంటి నొప్పికి చెక్‌ పెట్టవచ్చు.

తేనె..

తేనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దీని ద్వారా గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు. జలుబు చేసిన తర్వాత ఉండే గొంతు నొప్పికి తేనె మంచి ఔషధంలా పనిచేస్తుంది. కరోనా వ్యాపించిన తొలి రోజుల్లో తేనెను ఎక్కువగా తీసుకోమని నిపుణులు సూచించిన విషయం తెలిసిందే.

లవంగాలు..

పంటినొప్పికి లవంగాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. లవంగాలను నోట్లో వేసుకొని నమలడం ద్వారా.. దంత సమస్యలతో పాటు పంటి నొప్పికి చెక్‌ పెట్టవచ్చు. చూశారుగా మీ ఇంట్లోని వంట గదిలోనే ఎన్ని పెయిన్‌ కిల్లర్స్‌ ఉన్నాయో. కాబట్టి.. ఇకపై పెయిన్‌ కిల్లర్స్‌ ట్యాబెట్ల వాడకాన్ని తగ్గించి.. సహజంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ప్రారంభించండి.

Also Read: Health Benefits of Seafood: మటన్, చికెన్ ల కంటే సీఫుడ్స్ ఐన చేపలు, పీటలు, రొయ్యలు ఆరోగ్యానికి అత్యంత మేలు