Strawberry: స్ట్రాబెర్రీలతో కలిగే లాభాలన్నీ ఇన్నీ కావు… కీళ్లనొప్పులు, గుండె సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే..

Health Benefits Of Strawberry: ప్రకృతిలో లభించే ప్రతీ పండు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి వాటిలో స్ట్రాబేర్రీ ఒకటి. ఒకప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లలలో, పట్టణాల్లో మాత్రమే...

Strawberry: స్ట్రాబెర్రీలతో కలిగే లాభాలన్నీ ఇన్నీ కావు... కీళ్లనొప్పులు, గుండె సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే..
Follow us

|

Updated on: Feb 01, 2021 | 11:19 PM

Health Benefits Of Strawberry: ప్రకృతిలో లభించే ప్రతీ పండు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి వాటిలో స్ట్రాబేర్రీ ఒకటి. ఒకప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద సూపర్‌ మార్కెట్లలలో, పట్టణాల్లో మాత్రమే లభించే ఈ పళ్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వచ్చేశాయి. ఎక్కవగా శీతల ప్రాంతాల్లో పండించే స్ట్రాబేర్రీలు.. రవణా సదుపాయాలు, మార్కెంటింగ్‌ సదుపాయాలు పెరగడంతో అంతటా కనిపిస్తున్నాయి. మరి చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ పండుతో ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలున్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇంతకీ స్ట్రాబెర్రీ క్రమం తప్పకుండా తీసుకుంగటే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కంటి చూపునకు..

కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ సి.. ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడుతుంది.

గుండెకు మేలు..

స్ట్రాబెర్రీలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తోంది. ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాన్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పీచు.. జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది.

నోటి సమస్యలను..

క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్‌ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలను కూడా నివారించవచ్చు.

కీళ్లనొప్పులు…

ఇటీవల చాలా మంది కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. అయితే స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.

అల్సర్‌ మటుమాయం..

స్ట్రాబెర్రీలు అల్సర్‌ని తగ్గించడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని నిత్యం తీసుకుంటే ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఇన్ని పోషక విలువలు, మంచి గుణాలున్న స్ట్రాబెర్రీలను మీరు కూడా మీ ఆహారంలో ఓ భాగం చేసుకోండి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.

Also Read: Health benefits of spinach: బ్రెస్ట్ క్యాన్సర్‏ను పాలకూర అదుపు చేస్తుందా ? పోషకాహార నిధిగా ..