Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలనొప్పికి టాబ్లెట్లు కాకుండా ఇలా చేసి చూడండి..! నొప్పి చిటికెలో మాయం అవుతుంది..!

తల నొప్పి మనందరికీ ఏదో ఒక సమయంలో వచ్చే సాధారణ సమస్య. ఇది ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్ లేదా ఫోన్ ముందు గడపడం వల్ల వస్తుంది. కొందరికి తల నొప్పి భరించలేనంత ఎక్కువగా ఉంటే వెంటనే మందులు వేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని మందులు అందరికీ సరిపోవు. అలాంటి వారికి మందులు లేకుండా తల నొప్పి నుంచి ఉపశమనం పొందే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తలనొప్పికి టాబ్లెట్లు కాకుండా ఇలా చేసి చూడండి..! నొప్పి చిటికెలో మాయం అవుతుంది..!
Headache
Prashanthi V
|

Updated on: Jun 15, 2025 | 11:13 PM

Share

గోరింటాకు సాధారణంగా చేతులకు అలంకారం కోసం వాడతారు. కానీ ఇది తల నొప్పిని తగ్గించగల శక్తివంతమైన ప్రకృతిసిద్ధమైన ఔషధం. రాత్రి పూట గోరింటాకును నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు ఉదయం తాగితే తల నొప్పి నెమ్మదిగా తగ్గుతుంది. అలాగే గోరింటాకును మెత్తగా రుబ్బి, దానిని తలపై లేదా నొప్పి ఉన్న చోట పూతలా పెట్టినా మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది తలకు చల్లదనం ఇస్తుంది. దాంతో నొప్పి తగ్గుతుంది.

వేపాకు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీనిని తల నొప్పికి ఉపయోగించవచ్చు. దీని కోసం కొబ్బరి నూనెలో వేప ఆకులను వేసి కొన్ని గంటలు ఉంచి ఆ తర్వాత దానిని తలకు మసాజ్ చేయాలి. రోజూ వాడితే తల నొప్పికి మంచి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్‌ లో కూడా వేపాకు నూనె దొరుకుతుంది. ఇది తలలోని వేడిని తగ్గించి మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది.

కలబంద అంటేనే చర్మ సంరక్షణకు ప్రసిద్ధి. అయితే ఇది తల నొప్పి తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరానికి శాంతిని ఇస్తాయి. మీరు కలబంద గుజ్జును తీసుకుని నుదిటిపై అప్లై చేస్తే తలకు చల్లదనం కలుగుతుంది. ఇందులో 2 చుక్కల లవంగం నూనె, కొద్దిగా పసుపు కలిపి పేస్ట్ చేసుకుని 20 నిమిషాలు నుదిటిపై ఉంచితే నొప్పి మాయమవుతుంది.

తలనొప్పి చిన్న సమస్యగా అనిపించినా ఇది శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగా కూడా అసౌకర్యాన్ని కలిగించే సమస్యగా మారుతుంది. అయితే దీనిని నయం చేసేందుకు మందులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల తలనొప్పిని తక్కువ సమయంలో అదుపు చేయవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)