
పిల్లలపై మైకో ప్లాస్మానిమోనియా పంజా విసురుతోంది. అయిదు సంవత్సరాలలోపు పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు. మైకో ప్లాస్మానిమోనియా పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపిస్తుందని.. దీంతో పిల్లలు తీవ్రమైన అనారోగ్యాన్ని గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని ఆసుపత్రుల్లో మైకోప్లాస్మానిమోనియా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఎక్కువగా పిల్లలు ఈ మైకోప్లాస్మానిమోనియా బారినపడుతున్నారు. పీడియాట్రిక్ సెంటర్లు, ఆసుపత్రులలో చేరాల్సిన అవసరం ఉన్న దీర్ఘకాలిక, తీవ్రమైన నిమోనియా కేసులను పెరుగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ సీజన్‌లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు విపరీతంగా పెరుగుతుండటంతో, మైకో ప్లాస్మానిమోనియా ఇన్‌ఫెక్షన్‌లను గుర్తించి వెంటనే చికిత్సను అందించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు ముందస్తుగా వైద్య సలహా తీసుకోండి. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మైకో ప్లాస్మానిమోనియా పిల్లలలో కమ్యూనిటీ-ఆర్జిత న్యుమోనియా కేసులలో 10-40% బాధ్యత వహిస్తుంది. క్లూడ్ జ్వరం, పొడి దగ్గులో ప్రాథమిక లక్షణాలు, కానీ నెక్రోటైజింగ్ న్యుమోనియా, పల్మోనరీ ఎంబోలిజం, సెంట్రల్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా ఉంటాయని.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చేతులను శుభ్రంగా కడగడం, పరిశుభ్రతను పాటించండం, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. అదనపు రక్షణ కోసం ఇన్‌ఫ్లుఎంజా, న్యుమోకాకల్ వ్యాక్సిన్‌లతో సహా టీకాలు వేయించుకోవాలంటున్నారు నిలోఫర్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రవికుమార్.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.