AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ నొప్పేగా.. మనకేం అవుతుందిలే అనుకునేరు.. డేంజర్‌లో పడతారు బీకేర్‌ఫుల్

దైనందిన జీవితంలో తరచుగా శరీరంలోని పలు ప్రాంతాల్లో నొప్పిని ఎదుర్కొంటాము.. కానీ కొన్ని చిన్న చిన్న నొప్పులు పెను ప్రమాదంలో పడేలా చేస్తాయి.. ఈ నొప్పుల వెనుక సమస్యలను సకాలంలో గుర్తించకపోతే.. శరీరంలో అసౌకర్యం పెరుగుతుంది.. క్రమంగా అత్యవసర పరిస్థితికి కూడా దారితీయొచ్చు.. కాబట్టి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.

జస్ట్ నొప్పేగా.. మనకేం అవుతుందిలే అనుకునేరు.. డేంజర్‌లో పడతారు బీకేర్‌ఫుల్
Body Pains
Shaik Madar Saheb
|

Updated on: Feb 18, 2025 | 8:03 AM

Share

ప్రస్తుత కాలంలో మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. ఎల్లప్పుడూ.. మనం.. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధతో జాగ్రత్తగా చూసుకోవాలి.. అయితే.. ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం చాలా నొప్పులను ఎదుర్కొంటుంది. అయితే.. వాటిలో మనం శరీరంలోని పలు ప్రాంతాల్లో చిన్న చిన్న నొప్పులను విస్మరిస్తాము. కానీ అలా చేయడం ప్రమాదకరం.. కొన్ని నొప్పులను విస్మరించడం ద్వారా.. భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మనం మన దైనందిన జీవితంలో తరచుగా విస్మరించే కొన్ని నొప్పుల విషయంలో.. వాటి మూలాలను గుర్తించకపోతే శరీరంలో అసౌకర్యం పెరుగుతుంది.. కావున ఇలాంటి నొప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం.. అయితే.. ఎలాంటి నొప్పులను విస్మరించకూడదు.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ విషయాలను తెలుసుకోండి..

ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయకండి..

  1. తలనొప్పి: తలనొప్పి అనేక కారణాల వల్ల వస్తుంది. నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటివి.. కానీ మీరు ఈ నొప్పిని పదే పదే అనుభవించాల్సి వస్తే అది మైగ్రేన్‌కు సంకేతం కావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి తనిఖీ చేసుకోవడం ఉత్తమ ఎంపిక..
  2. కండరాల నొప్పి: కండరాల నొప్పికి ప్రధాన కారణం విటమిన్ డి లోపం.. ఎందుకంటే చాలా పట్టణ ప్రాంతంలోని ఇళ్లకు సూర్యరశ్మి అందదు.. దీని కారణంగా, కండరాల నొప్పి అనివార్యం.. అయితే దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ విటమిన్ లోపాన్ని అధిగమించడానికి.. కొన్ని ఆహార పదార్థాలను కూడా తినవచ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఛాతీ నొప్పి: మీకు తేలికపాటి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.. ఇది సాధారణంగా గుండె జబ్బుల ముఖ్యమైన హెచ్చరిక సంకేతంగా పరిగణిస్తారు. ముఖ్యంగా, నొప్పి.. శరీరం ఎడమ వైపున మొదలవుతుంది. జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటుకు కారణమవుతుంది.
  5. కీళ్ల నొప్పి: గాయం, వాపు, పెరిగిన జలుబు వంటి అనేక కారణాల వల్ల కీళ్ల నొప్పులు సంభవించవచ్చు. కీళ్ల నొప్పుల సమస్య ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. గతంలో ఈ సమస్య మధ్య వయస్కులు, వృద్ధులలో మాత్రమే కనిపించేది.. కానీ ఇప్పుడు చాలా మంది యువకులు దీని బాధితులుగా మారుతున్నారు. ముఖ్యంగా మీ శరీరంలో కాల్షియం లోపం ఉంటే ఇలాంటి సమస్య రావొచ్చు..
  6. కడుపు నొప్పి: మనం సాధారణంగా కడుపు నొప్పిని జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యగా పరిగణిస్తాము. కానీ అది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్.. జీర్ణశయాంతర రుగ్మత లేదా పునరుత్పత్తి వ్యవస్థ సమస్య కావచ్చు. కానీ సరైన పరిశోధన తర్వాతే అసలు వ్యాధిని గుర్తించవచ్చు.

అందుకే.. ఇలాంటి నొప్పుల విషయంలో అశ్రద్ధ చేయకండి.. వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని.. సలహాలు.. సూచనలు పాటించడం మంచిది..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)