AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నాయనో.. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా.. చాలా మంది అధిక కొలెస్ట్రాల్ (LDL) సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు గుడ్లు తినడం మానేస్తారు. గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? గుడ్లు ఆరోగ్యానికి మంచిది కాదా..? నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

ఓర్నాయనో.. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Eggs Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 18, 2025 | 9:08 AM

సైలెంట్ కిల్లర్.. హై కొలెస్ట్రాల్ ప్రాణాలు తీస్తోంది.. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం కారణంగా.. చాలా మంది అధిక కొలెస్ట్రాల్ (LDL) సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. ప్రమాదకర జబ్బులకు అధిక బరువుతోపాటు కొలెస్ట్రాల్ కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఈ రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది రక్త నాళాలలో పేరుకుపోయే మైనపు లాంటి కొవ్వు.. చెడు కొలెస్ట్రాల్ LDL పెరిగినప్పుడు, అది ధమనులలో అడ్డంకిని కలిగిస్తుంది.. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం లేదా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం..

కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు

కొలెస్ట్రాల్ పెరగడానికి అధిక కొవ్వు పదార్థాలు జంక్ ఫుడ్, నూనె పదార్థాలు తీసుకోవడం వంటి అనేక కారణాలు కావొచ్చు.. కొవ్వు పదార్థాలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుడ్లు ఆరోగ్యానికి చాలామంచిది. అయితే.. చాలా మంది గుడ్లను కొవ్వు పదార్థంగా భావిస్తారు. దీనివల్ల గుడ్లు తినరు. గుడ్లు తినడం వల్ల నిజంగా కొలెస్ట్రాల్ పెరుగుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. చాలా మంది గుడ్లను అధిక కొలెస్ట్రాల్ ఆహారంగా భావిస్తారు.. అందువల్ల దానిని ఆహారంలో చేర్చుకోరు.. ఇది నిజం కాదని.. గుడ్లలో పోషకాలు చాలా ఉన్నాయని.. ఇవి కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచవని అధ్యయనం పేర్కొంది.

గుడ్లు – కొలెస్ట్రాల్ మధ్య సంబంధం ఉందా?

గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని, దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నమ్ముతారు. 1968లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గుడ్ల వినియోగాన్ని తగ్గించాలని సిఫారసు చేసింది.. కానీ తరువాతి అధ్యయనాలు, పరిశోధనలు గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్‌కు శరీరంలోని కొలెస్ట్రాల్‌తో ప్రత్యక్ష సంబంధం లేదని నిరూపించాయి. ఈ కారణంగా, గుడ్లు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు.అయితే.. గుడ్లు ఎక్కువగా తినకూడదని.. పరిమితంగా తినాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఉడికించిన గుడ్డు..

కొలెస్ట్రాల్ రోగులు ఉడికించిన గుడ్లలోని తెల్ల భాగాన్ని సులభంగా తినవచ్చు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు. కొందరు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకూడదంటారు.. కానీ.. అది కూడా తినవచ్చని.. కానీ హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు మాత్రం దీనికి దూరంగా ఉంటే బెటర్ అని పేర్కొంటున్నారు నిపుణులు.. అదే సమయంలో, వేయించిన గుడ్లు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నూనెలో ఉడికించిన గుడ్లు మీ కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపు, మెదడుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..