రాత్రిపూట 11 గంటల తర్వాత నిద్రపోతే ఏమవుతుందో తెలుసా..? వామ్మో పెను ప్రమాదమే..
నేటి కాలంలో ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పులలో ఒకటి రాత్రి వేళ మేల్కొని ఉండటం.. ఆలస్యంగా నిద్రపోవడం.. మీరు కూడా రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతుంటే.. అనేక వ్యాధులను ఆహ్వానిస్తున్నట్లేననని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం...

ప్రతిరోజూ రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతుంటే.. ఈ అలవాటు మీ ఆరోగ్యం, జీవనశైలిపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర శరీరాన్ని కోలుకునేలా చేస్తుంది.. అంటే రిపేర్ చేస్తుంది.. దీంతోపాటు మానసిక ఆరోగ్యం, శక్తి స్థాయిలకు నేరుగా సంబంధించినది.. కాబట్టి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు క్రమంగా శరీరం పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు కొన్నిసార్లు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే, అది పెద్ద సమస్య కాదు.. కానీ అది రోజువారీ అలవాటుగా మారితే, క్రమంగా మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
అటువంటి పరిస్థితిలో, మంచి ఆరోగ్యం కోసం 7-8 గంటలు పూర్తి నిద్రపోవడం ముఖ్యం. రాత్రి త్వరగా నిద్రపోకపోతే, రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఇది ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, ప్రతి రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోకపోవడం మన శరీరానికి చాలా హానికరమని.. ఇది ఎన్నో సమస్యలను కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల నిద్ర నాణ్యత చెడిపోవడమే కాకుండా జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
వైద్య నిపుణులు ఏమి చెబుతున్నారంటే..
రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతే, మీ శరీర గడియారం చెదిరిపోతుందని, దాని కారణంగా మీరు లోతైన, సౌకర్యవంతమైన నిద్ర పొందలేరని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా, ఉదయం నిద్ర లేచినప్పుడు అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. దీనితో పాటు, ఆలస్యంగా నిద్రపోవడం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మెదడు సరైన సమయంలో విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. దీని వలన మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివి జరుగుతాయి.
ఇది మాత్రమే కాదు, మీ ఈ చెడు అలవాటు వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు. నిజానికి, మంచి నిద్ర శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది.. కానీ మీరు ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోతే, రోగనిరోధక శక్తి బలహీనపడి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల బరువు పెరుగుతుంది…
అర్థరాత్రి వరకు మేల్కొని ఉండే వ్యక్తులు తరచుగా అనారోగ్యకరమైన చిరుతిళ్లు తింటారని, దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది శక్తి స్థాయిలను, జీర్ణక్రియను బలహీనపరుస్తుంది. అంతేకాకుండా, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం పనిని ప్రభావితం చేయడమే కాకుండా, రాత్రి మేల్కొని ఉండే విద్యార్థుల చదువులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. పేర్కొంటున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉత్పాదకత తగ్గి, రోజంతా అలసటగా అనిపిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




