AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ ని పొరపాటున కూడా వీరు తినకూడదు..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

మనలో చాలా మందికి మటన్ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. చాలా మంది ప్రియులు ఉన్నారు మటన్ కి. స్పెషల్ డేస్‌లో, ఆదివారాల్లో దీన్ని ప్రత్యేకంగా పలు రకాల వంటకాలను చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తారు. మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై, మటన్ కర్రీ ఇలా రకరకాల వంటకాలుగా దీన్ని వండుతారు.

మటన్ ని పొరపాటున కూడా వీరు తినకూడదు..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Mutton Curry
Prashanthi V
|

Updated on: Feb 16, 2025 | 9:09 PM

Share

మటన్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు దీనిని మితిమీరిన స్థాయిలో తీసుకుంటే అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. మరికొందరు మాత్రం ఆరోగ్య పరిస్థితుల వల్ల మటన్ తినకూడదు. మరి ఎవరు మటన్ ని తినకూడదో. ఎందుకు తినకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మటన్ లో ఉండే పోషక విలువలు మీకు తెలుసా..? 100 గ్రాముల మటన్ లో 143 కేలరీలు, 27 గ్రాముల ప్రోటీన్, 3 గ్రాముల కొవ్వు, 86 మి.గ్రా సోడియం, 3.7 మి.గ్రా ఐరన్, 75 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇప్పుడు మటన్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

  • మటన్ ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం సమృద్ధిగా కలిగి ఉంటుంది.
  • ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి మేలు చేస్తాయి.
  • బలహీనమైన ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
  • రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.

ఇక మటన్ ఎక్కువగా తింటే జరిగే హానికర ప్రభావాల విషయానికి వస్తే.. మటన్‌ను ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొవ్వుతో ఉన్న మటన్ తరచూ తీసుకుంటే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. అధిక మోతాదులో తీసుకుంటే శరీరానికి వేడిని కలిగించడంతో పాటు మూత్రపిండాలకు, కాలేయానికి సమస్యలు తలెత్తుతాయి. ఏ ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదో తెలుసుకుందాం.

లివర్ సమస్యలు

కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు మటన్ ని పూర్తిగా నివారించాలి. మటన్‌లో అధికంగా ఉండే ప్రోటీన్, కొవ్వు కారణంగా లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీన్ని తినకపోవడమే ఉత్తమం.

అధిక రక్తపోటు

హై బీపీ ఉన్నవారు మటన్‌ను మితంగా తినాలి. దీనిలో సోడియం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల రక్తపోటును పెంచే అవకాశం ఉంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌లకు దారి తీస్తుంది.

కిడ్నీ సమస్యలు

మటన్ లో అధిక ప్రోటీన్ ఉండడం వల్ల మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనిని పూర్తిగా మానేయడం మంచిది.

గర్భిణీలు, పిల్లలు

గర్భిణీలు మటన్ ని మితంగా తీసుకోవాలి. చాలా వేడిగా ఉండే ఈ ఆహారం గర్భస్రావానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిన్నపిల్లలు అధిక మోతాదులో మటన్ తినకూడదు.

అధిక వేడి

కొంతమందికి శరీరంలో సహజంగానే ఎక్కువ వేడి ఉంటుంది. అటువంటి వారు మేక మాంసాన్ని తీసుకుంటే తలనొప్పి, కడుపు సమస్యలు, మంట వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

మటన్ తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మటన్‌ను పూర్తిగా ఉడికించకపోతే కొన్ని జూనోటిక్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
  • అధిక కొవ్వుతో కూడిన మటన్ ని తినకూడదు.
  • వారానికి ఒకసారి మాత్రమే తినడం మంచిది.
  • పచ్చి మటన్ ను తినడం ఆరోగ్యానికి హానికరం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి