AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulberries: మల్బరీ ఆరోగ్యానికి వరం.. వ్యాధులను దూరం చేసే సామర్థ్యం వీటికే..

ప్రకృతిలో కనిపించే ప్రతి ఒక్క పండ్లలో పోషక విలువలతో కూడి ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి పోషకాలు పండ్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులతో పోరాడుతాయి..

Mulberries: మల్బరీ ఆరోగ్యానికి వరం.. వ్యాధులను దూరం చేసే సామర్థ్యం వీటికే..
Mulberry Benefits
Subhash Goud
|

Updated on: Jan 12, 2023 | 8:55 PM

Share

ప్రకృతిలో కనిపించే ప్రతి ఒక్క పండ్లలో పోషక విలువలతో కూడి ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి పోషకాలు పండ్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులతో పోరాడుతాయి. అంతేకాకుండా ముందస్తుగా వ్యాధులు దరి చేరకుండా చేస్తాయి. ఇలాంటి మల్బరీ ఒకటి. ఇందులో ఎన్నో పోషక గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తినడానికి పుల్లగా, రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉంటాయి. ఇవి ద్రాక్ష పండులా ఉంటాయి. ఈ పండు విటమిన్లకు మంచి మూలం అనే చెప్పాలి.

  1. మధుమేహం: మధుమేహ రోగులకు మల్బరీ దివ్యౌషధం. టైప్ -2 డయాబెటిస్‌ ఉన్నవారికి ఇవి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారు మల్బరీని తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే ప్లాస్మా గ్లూకోజ్‌ని పెంచుతుంది. ఇది శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
  2. క్యాన్సర్‌కు మేలు చేస్తుంది: మల్బరీలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. అలాగే క్యాన్సర్ ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. మల్బరీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి మొక్కల ఉత్తమ సమ్మేళనాలు ఇందులో కనిపిస్తాయి. ఇది క్యాన్సర్ కణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  3. కళ్లకు ఉపయోగపడుతుంది: మల్బరీ మన కంటి చూపునకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇది నేరుగా మన కళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది రెటీనాకు హానిని నివారిస్తుంది. కంటిశుక్లం వంటి వ్యాధులలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా పరిశోధనలలో రుజువైంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి