AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలలో ఎండు ద్రాక్ష నానబెట్టి తినండి.. మస్తు లాభాలు పొందుతారు..!

ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరానికి చాలా లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఒక సహజసిద్ధమైన హెల్తీ డ్రింక్. పాలలో ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఎండు ద్రాక్షలో ఐరన్, ఫైబర్, సహజ చక్కెరలు, చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

పాలలో ఎండు ద్రాక్ష నానబెట్టి తినండి.. మస్తు లాభాలు పొందుతారు..!
Soaked Raisins In Milk
Prashanthi V
|

Updated on: Jun 17, 2025 | 7:29 PM

Share

పాలు, ఎండు ద్రాక్ష రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియకు మద్దతు ఇచ్చే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా నీటిలో కాకుండా పాలలో ద్రాక్షను నానబెట్టి తీసుకుంటే దీని ప్రభావం మరింత పెరుగుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దాన్ని పాలలో నానబెట్టి తింటే ఐరన్ ఒంటపట్టడం మరింత మెరుగుపడుతుంది. రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్నవాళ్లకు ఇది ఒక సహజ మార్గం.

పాలలో కాల్షియం ఉంటే ఎండు ద్రాక్షలో బోరాన్ అనే ఖనిజం ఉంటుంది. ఈ రెండింటి కలయిక ఎముకలకు అవసరమైన బలాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను ఇది తగ్గించే అవకాశం ఉంది.

నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ పేగులు చక్కగా పని చేసేలా చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. పాలలో కలిపి తీసుకోవడం వల్ల ఆమ్ల స్థాయులు నియంత్రితంగా ఉండి, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

పాలు ఎండు ద్రాక్ష రెండింటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని రోగాలు రాకుండా కాపాడుతాయి. రోజూ తీసుకుంటే సాధారణ జలుబు, దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీని వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది.

ఎండు ద్రాక్షలో ఉండే సహజ చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్ శరీరానికి వేగంగా శక్తిని ఇస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శక్తి పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.

ఒక గ్లాసు పాలలో 6 నుంచి 8 ఎండు ద్రాక్ష వేసి రాత్రి నానబెట్టండి. ఆ పాలను ఉదయం వడగట్టి.. పాలు తాగకపోయినా సరే ద్రాక్షను తినండి. ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ అలవాటు కొన్ని రోజులపాటు పాటిస్తేనే శరీరంలో మంచి మార్పులు కనపడతాయి. మీరు అనీమియా, జీర్ణ సమస్యలు, ఎముకల బలహీనత లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఇది సహజమైన, సురక్షితమైన పరిష్కారం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)