Menstrual Health: పీరియడ్స్ నొప్పిని తగ్గించే టీలు.. ఇంట్లోనే ఈజీగా చేయండి..!
ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో కొంత మంది స్త్రీలు కడుపు నొప్పితో చాలా బాధపడుతారు. ఈ నొప్పి వల్ల వాళ్లకు ఒత్తిడి, అసౌకర్యం, అలసట లాంటి సమస్యలు వస్తుంటాయి. మందులు వాడకుండా సహజంగా ఈ నొప్పి నుండి ఉపశమనం పొందాలనుకునే వాళ్లకు కొన్ని రకాల టీలు బాగా సహాయపడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం మన వంటింట్లో ఎప్పుడూ ఉండేదే. దీనికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలో నొప్పి, వాపును తగ్గించడంలో బాగా పని చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మలబద్ధకం, ఒత్తిడి తగ్గించడానికి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒకసారి తేలికపాటి అల్లం టీ తాగితే మంచి ఉపశమనం దొరుకుతుంది.
దాల్చిన చెక్క టీ తీపి, మసాలా రుచి కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉండే నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఈ టీ గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని తగ్గించుకోవాలంటే.. దాల్చిన చెక్కతో చేసిన వేడి టీ తాగడం మంచిది.
పెప్పర్ మింట్ ఆకుల నుండి తయారు చేసే ఈ టీ తాగితే శరీరం చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇది కండరాలను సడలించే గుణాలను కలిగి ఉంటుంది. పెప్పర్ మింట్ టీ తాగితే కడుపు నొప్పి తగ్గుతుందని కొంతమంది మహిళలు చెబుతున్నారు. దీనికి పూర్తి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా.. ఇది ఒక సహజమైన రిలాక్సింగ్ మార్గంగా భావించవచ్చు.
క్యామోమైల్ (Chamomile) పువ్వులతో తయారు చేసే ఈ టీకి మంచి సువాసన ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో సరిగా నిద్ర పట్టని మహిళలకు ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇది కొంత వరకు అధిక రక్తస్రావాన్ని కూడా తగ్గిస్తుంది.
రెడ్ రాస్ప్‌బెర్రీ ఆకుల టీ రుచి బ్లాక్ టీ లా ఉంటుంది. ఇది ముఖ్యంగా గర్భాశయ కండరాలను బలపరచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. కొంతమంది మహిళలు దీన్ని తరచుగా తాగి పీరియడ్స్ సమస్యల నుండి ఉపశమనం పొందామని అంటున్నారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నా.. అనుభవాల ఆధారంగా దీనికి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)