Cigarette: సిగరేట్‌ పొగలో 7 వేల రసాయనాలు.. నానాటికి పెరుగుతున్న క్యాన్సర్ మరణాలు!

ఈ రోజుల్లో లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరూ సిగరేట్లు, మద్యపానం వంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఈ అలవాట్లతో వారి ఆరోగ్యానికేకాకుండా పక్కనున్న వారి ఆరోగ్యం కూడా పతనం..

Cigarette: సిగరేట్‌ పొగలో 7 వేల రసాయనాలు.. నానాటికి పెరుగుతున్న క్యాన్సర్ మరణాలు!
Cigarette Smoking
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 23, 2022 | 11:17 AM

Cigarette smoke contains over 7,000 chemicals: ఈ రోజుల్లో లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరూ సిగరేట్లు, మద్యపానం వంటి దురలవాట్లకు బానిసలవుతున్నారు. ఈ అలవాట్లతో వారి ఆరోగ్యానికేకాకుండా పక్కనున్న వారి ఆరోగ్యం కూడా పతనం అవుతుందని ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే తాజాగా సిగరెట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ జనాభాలో కొన్ని కోట్ల మంది ప్రజలు ధూమపానం చేస్తున్నారు. వీళ్లు వదిలే సిగరెట్ పొగ వల్ల వాతావరణంలో 7000 కంటే ఎక్కువ రసాయనాలు విడుదలవుతున్నాయట. దీనివల్ల మనుషులు, జంతువులు ప్రభావితమవుతున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా క్యాన్సర్ బారీన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఈ రసాయనాలు గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. సిగరెట్లు ఊపిరితిత్తులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. 10 ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల్లో 9 ధూమపానం కారణంగానే సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెల్పింది.

కొంత మంది సగం సిగరేట్‌ కాల్చి విసిరేస్తుంటారు. ఇలా పాక్షికంగా కాల్చి విసిరివేసిన సిగరెట్‌ల వల్ల కూడా పెద్ద మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. పారవేసిన సిగరేట్‌ వ్యర్ధాలు భూమిలో కలిసిపోవడానికి 10 యేళ్ల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతీ యేట 4.5 ట్రిలియన్ల (45 వేల కోట్లు) సిగరేట్‌ వ్యర్ధాలు భూమిపై పేరుకుపోతున్నట్లు వెల్లడించింది. వీటితో ఇతర రసాయనలు చేరి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సిగరెట్ వల్ల మనిషి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో, ఇతర జంతువులు కూడా అంతే ప్రభావితం అవుతాయి. అలాగే పర్యావరణంపై దుష్ప్రభావం చూపుతాయి.