Monsoon Diet Tips: వర్షాకాలం వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తుంది దీంతో పాటు పలు సీజనల్ వ్యాధులను కూడా మోసుకొస్తుంది. వర్షాకాలంలో డయేరియా, ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో మొక్కజొన్న, గుడ్లు, కొబ్బరి నీళ్లు, పెరుగు తదితర పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవచ్చు. మరి వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి డైట్‌టిప్స్ (Monsoon Diet Tips) పాటించాలో తెలుసుకుందాం రండి.
మొక్కజొన్న
వర్షాకాలంలో ఉడకబెట్టిన లేదా కాల్చిన మొక్కజొన్న తీసుకోవడం చాలామంచిది. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా చాలా ఆరోగ్యకరమైనది కూడా. పైగా ఇందులో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. అదే సమయంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువును తగ్గించడంలో సహాయపడుతాయి. డయేరియా, ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
గుడ్లు
గుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇవి కండరాలను పటిష్ఠం చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో విటమిన్లు B12, B2, A, Dతో పాటు జింక్, ఐరన్, యాంటీఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారి నుంచి రక్షణ కల్పి్స్తాయి.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా శరీరాన్ని వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషతుల్య పదార్థాలను తొలగిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని విటమిన్ సి వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పి్స్తుంది.
సీజనల్ ఫ్రూట్స్..
ఈ సీజన్‌లో లిచ్చి, బొప్పాయి, పియర్ తదితర సీజనల్ ఫ్రూట్స్‌ను తరచుగా తీసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వివిధ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతాయి. జామున్‌లో ఐరన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
అల్లం
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..