Periods: పీరియడ్స్ మిస్ అవుతున్నాయా ? ఈ లడ్డూ ఒక్కటి తింటే చాలు అంతా సెట్
పెళ్లైన ఆడవారికైనా.. పెళ్లి కానీ యువతులకైనా.. ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడీ (Polycystic Ovarian Disease). ఈ సమస్యను తగ్గించుకునేందుకు డాక్టర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ లడ్డూ..
పెళ్లైన ఆడవారికైనా.. పెళ్లి కానీ యువతులకైనా.. ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడీ (Polycystic Ovarian Disease). ఈ సమస్యను తగ్గించుకునేందుకు డాక్టర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా.. సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఈ లడ్డూ అద్భుతంగా పనిచేస్తుంది.
రజస్వల అయిన ప్రతి ఆడపిల్లకు ఇది ఖచ్చితంగా పెడతారు. మనకు తెలిసిందే అయినా.. మనం దాన్ని పక్కన పెడతాం. మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో చాలా వాటికి చెక్ పెట్టవచ్చు. అందులో నువ్వులు బెల్లం లడ్డూలు. వీటినే నువ్వులుండలు అని కూడా అంటారు. అయితే పంచదారతో కాకుండా.. అసలు సిసలైన బెల్లంతో నువ్వులుండ ప్రతిరోజూ తింటే.. పీరియడ్స్ రావట్లేదన్న సమస్యే ఉండదు. మరి దానిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
పావుకిలో నువ్వులను లైట్ గా వేయించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసుకుని.. పావుకిలో తరిగిన బెల్లం వేసుకోవాలి. తినే ఇష్టాన్ని బట్టి ఒక యాలక్కాయ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసి.. ఉండల్లా చుట్టుకుని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. నువ్వులను వేయించి ఇలా తయారు చేసుకోవడం వల్ల అవి ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి.
రుతుక్రమం (Periods) పూర్తయిన ఆరవ రోజు నుంచి వారం రోజుల పాటు రోజూ ఉదయం టిఫిన్ చేశాక లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తింటే చాలు. వీలైతే 21 రోజుల పాటు రోజుకొక నువ్వుల లడ్డూ తింటే ఇంకా మంచిది. ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ (Irregular Periods)కు ఇట్టే చెక్ పెట్టేయొచ్చు. మార్కెట్లో దొరికే రెడీమేడ్ నువ్వుల ఉండలకంటే ఇంట్లోనే తయారు చేసుకుని తింటే మంచి ఫలితాలుంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..