Men’s Health: పురుషుల్లో ఈ 5 వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు..

పురుషులు ఆరోగ్యంగా ఉండటానికి అనేక విటమిన్లు, ఖనిజాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం, అతిగా మద్యపానం, ధూమపానం అలవాటు చేయడం వల్ల శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి.

Men's Health: పురుషుల్లో ఈ 5 వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు..
Mens Health
Follow us
Venkata Chari

|

Updated on: Feb 16, 2022 | 6:40 AM

పురుషుల శరీరానికి అనేక విటమిన్లు, పోషకాలు అవసరమవుతాయి. ఇవి చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. శరీరంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ లోపిస్తే ఇంట్లో, ఆఫీసులో ఏ పనీ సరిగ్గా చేయలేరు. చాలా సందర్భాలలో, స్త్రీల కంటే పురుషులు ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉండటానికి, పురుషులు వారి ఆహారం, జీవితం రెండింటినీ ప్లాన్ చేసుకోవాలి. మీ అజాగ్రత్త కారణంగా చాలా తీవ్రమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది.

1- ప్రోస్టేట్ క్యాన్సర్- వృద్ధాప్యంతో పురుషులలో ప్రోస్టేట్‌కు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. చాలాసార్లు పురుషులలో ప్రోస్టేట్ గ్రంథి విస్తరించే సమస్య మొదలవుతుంది. పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. దీన్ని నివారించడానికి, మీరు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

2- అంగస్తంభన లోపం- పురుషులలో వృద్ధాప్యంతో పాటు, అంగస్తంభన సమస్య కూడా మొదలవుతుంది. ఇది ప్రమాదకరమైన వ్యాధి కానప్పటికీ, దీని కారణంగా పురుషులు తమ జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించలేరు. ఇలాంటి పరిస్థితిల్లో కొన్నిసార్లు పురుషులలో డిప్రెషన్ పెరుగుతుంది.

3- టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుదల- టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుదల కారణంగా, పురుషులలో అనేక సమస్యలు మొదలవుతాయి. టెస్టోస్టెరాన్ తక్కువ స్థాయిల కారణంగా పురుషుల లైంగిక సమస్యలను ప్రభావితం చేస్తుంది. ఇది పురుషుల స్పెర్మ్ ఉత్పత్తి, లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

4- గుండె సమస్య- పురుషుల్లో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మహిళల కంటే పురుషులకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. గుండెపోటు వల్ల ప్రపంచంలోనే అత్యధిక మంది పురుషులు చనిపోతున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇందుకోసం పురుషులు కూడా తమ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.

5- ఊపిరితిత్తుల క్యాన్సర్- ధూమపానం విషయంలో స్త్రీల కంటే పురుషులే ముందున్నారు. అతిగా ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం కారణంగా ఉన్నాయి. అందుకే పురుషులు కూడా తమ ఊపిరితిత్తులను చెక్ చేసుకుంటూ ఉండాలి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులను కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచింది.

Also Read: Drumstick Leaves: ఇది ఆకుకూర కాదు.. ఆకుపచ్చ బంగారం.. ఎన్నో వ్యాధులకు సహజ ఔషధం..

Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి