Magnesium Oil: నిద్రలేమికి అద్భుతమైన రెమిడీ.. మెగ్నిషియం ఆయిల్ బెనిఫిట్స్ తెలిస్తే అవాక్కవుతారు…
ఆరోగ్యకరమైన జీవితానికి నాణ్యమైన నిద్ర చాలా అవసరం. అయితే, నేటి ఆధునిక జీవనశైలిలో చాలామందికి నిద్రలేమి ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించడానికి నిపుణులు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు. అదే మెగ్నీషియం ఆయిల్. రాత్రి పడుకునే ముందు పాదాలకు ఈ నూనెను రాసుకోవడం వల్ల కేవలం నిద్రలేమి మాత్రమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని వారు చెబుతున్నారు.

మంచి నిద్రకు, మెరుగైన ఆరోగ్యానికి ఈ నూనె తప్పనిసరి. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పట్టడం ఎంతో అవసరం. కానీ చాలామందికి ఇది కష్టంగా మారింది. ఇలాంటి నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి నిపుణులు ఒక సులభమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు పాదాలకు మెగ్నీషియం ఆయిల్ రాసుకోవడం. ఈ నూనె రాయడం వల్ల నిద్ర బాగా పట్టడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
ప్రయోజనాలివే:
ప్రశాంతమైన నిద్ర: రాత్రిపూట పాదాలకు మెగ్నీషియం ఆయిల్ మసాజ్ చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా గాఢ నిద్రపడుతుంది. ఈ నూనె చర్మంలోకి ఇంకగానే మెలటానిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ సరైన స్థాయిలో ఉండటం వల్ల మెదడు రిలాక్స్ అయి, శరీరం చల్లబడి, బడలిక తగ్గి త్వరగా నిద్రపడుతుంది.
కండరాల నొప్పి నివారణ: రోజంతా శ్రమించి అలసిపోయినప్పుడు వచ్చే కండరాల నొప్పులను మెగ్నీషియం ఆయిల్ తగ్గిస్తుంది. ఈ నూనె కండరాలకు తగలగానే అవి విశ్రాంతి పొంది, నొప్పి, వాపు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే తిమ్మిర్లు, నరాల నొప్పులు తగ్గుతాయి. నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.
ఒత్తిడి తగ్గింపు: తీవ్రమైన ఒత్తిడి నిద్రలేమికి ప్రధాన కారణం. మెగ్నీషియం ఆయిల్ పాదాలకు రాసినప్పుడు సెరటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ‘ఫీల్ గుడ్’ హార్మోన్‌గా పనిచేసి నరాలను రిలాక్స్ చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించి, ఆందోళనను దూరం చేస్తుంది, తద్వారా హాయిగా నిద్ర పడుతుంది.
మలబద్ధకానికి పరిష్కారం: మెగ్నీషియం ఆయిల్ కేవలం నిద్రకు మాత్రమే కాదు, మలబద్ధకం సమస్యను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇది పెద్దపేగు కండరాల కదలికలను ప్రేరేపించి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి, కడుపు ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
ఎలా వాడాలి: ముందుగా పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పాదాలు కాస్త తడిగా ఉన్నప్పుడు మెగ్నీషియం ఆయిల్‌ను 5-10 సార్లు స్ప్రే చేయాలి. ముఖ్యంగా మడమల దగ్గర ఎక్కువగా స్ప్రే చేసి, కనీసం మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వేడి నీళ్లతో స్నానం చేసిన వెంటనే అప్లై చేస్తే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి.




