ఈ రోజుల్లో తక్కువ లేదా అధిక రక్తపోటు సమస్య తరచూ వింటున్నాం.. రక్తపోటు తక్కువగా ఉండటం.. బ్లడ్ ప్రజెర్ ఎక్కువగా ఉండటం రెండూ ప్రమాదకరమైనవే.. వీటిని విస్మరించడం ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ రక్తపోటును వైద్య భాషలో హైపోటెన్షన్ అంటారు. రక్తపోటు సాధారణ స్థాయి కంటే పడిపోయినప్పుడు దానిని లోబీపీ (లో బ్లడ్ ప్రెజర్) లేదా రక్తపోటు తక్కువగా ఉండటం అంటారు. రక్తపోటు తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చాలా సార్లు తమకు తక్కువ రక్తపోటు సమస్య ఉందని కూడా గ్రహించలేరు. శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభించినా.. దానిపై శ్రద్ధ చూపరు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు చాలా అలసట, వికారంగా అనిపిస్తుంది. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. తక్కువ రక్తపోటు కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులకు దారితీస్తుందని.. అలాంటి కారణాల్లో ఇది కూడా ఒకటని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తపోటు తక్కువగా ఉన్న వ్యక్తుల్లో చాలా సార్లు వారి బీపీ తగ్గినట్లు తెలియదు. బీపీ కొద్దిగా తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే ప్రజల దృష్టి ఇలాంటి విషయం వైపు చాలా తక్కువగా ఉంటుంది. అయితే, చాలాసార్లు లక్షణాలు కనిపించిన తర్వాత కూడా, లోబీపీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరం అవుతుంది.
ఈ లక్షణాలలో ఏవైనా మీకు అనిపిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అకస్మాత్తుగా స్పృహ కూడా కోల్పోతారు.
ఆరోగ్యకరమైన రక్తపోటు పరిధి 120/80 (mm Hg) ఉండాలి. దీన్ని సాధారణ రక్తపోటుగా పేర్కొంటారు. తక్కువ రక్తపోటుకు స్థిరమైన కటాఫ్ పాయింట్ లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది అందరిలో భిన్నంగా ఉంటుంది. రక్తపోటు 90/60 mm Hg కంటే తక్కువగా ఉంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. 130/90 అంతకంటే ఎక్కువగా ఉంటే.. హైబీపీగా పేర్కొంటారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..