Tulsi: పూజలో గంగాజలాన్ని, తులసి ఆకులను ఎందుకు ఉపయోగిస్తారు..? కారణాలు ఏమిటని ఆలోచించారా..?

అన్ని రకాల పూజలలో గంగా జలాన్ని, తులసి ఆకులను ఉపయోగించనప్పటికీ, హిందూ పూజలలో అవి ఒక అంతర్భాగం. పూజ పళ్లెంలో నైవేద్యాలను అమర్చడానికి తులసి ఆకులు చాలా అవసరం. అన్ని పూజలలో గంగాజలానికి ..

Tulsi: పూజలో గంగాజలాన్ని, తులసి ఆకులను ఎందుకు ఉపయోగిస్తారు..? కారణాలు ఏమిటని ఆలోచించారా..?
Tulsi And Gangajal
Follow us

|

Updated on: Nov 20, 2022 | 3:41 PM

అన్ని రకాల పూజలలో గంగా జలాన్ని, తులసి ఆకులను ఉపయోగించనప్పటికీ, హిందూ పూజలలో అవి ఒక అంతర్భాగం. పూజ పళ్లెంలో నైవేద్యాలను అమర్చడానికి తులసి ఆకులు చాలా అవసరం. హిందూ లేదా సనాతన ధర్మంలోని అన్ని పూజలలో గంగాజలానికి దానికంటూ ప్రత్యేకమైన పాత్రం ఉంది. హిందూమతంలో తులసి, గంగా జలం ఔషధంగా ఇంకా.. వివిధ ఆచారాలలో ఉపయోగకరంగా ఉంటాయి. చాలా మంది తులసి ఆకులు, గంగాజలంతో అనేక ఆచారాలను పాటిస్తారు. కానీ పూజ సమయంలో ఈ రెండూ ఎందుకు తప్పనిసరి అని చాలా మందికి తెలియదు. దాని గురించి అసలు ఆలోచించరు.

పూజలో గంగా జలం, తులసి ఆకులు ఎందుకు..?

గంగాజలాన్ని భగవంతుని ప్రసాదం, చరణామృతం అంటారు. తులసి ఆకులు లేనిదే పూజ అసంపూర్ణం. పూజ సమయంలో గంగాజలంలో తులసి ఆకులు వేస్తారు అసలు కారణం ఇక్కడ తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి
  • హిందూ ధర్మ విశ్వాసం ప్రకారం..  తులసి ఆకులు చాలా పవిత్రమైనవి. ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది హిందువులు ఇప్పటికీ నమ్ముతారు. దీనితో పాటు విష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందని వారి ప్రగాఢమైన విశ్వాసం.
  • గంగాజలం, తులసి ఆకులతో కూడిన నీటిని రాగి లేదా ఇత్తడి పాత్రలో ఉంచినట్లయితే, ఆ నీరు అమృతం వలె స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందని ఓ విశ్వాసం.  శ్రీకృష్ణుడు.. విష్ణు అవతారం. అతనికి చాలా ఇష్టమైనది తులసి ఆకు.అందుకే పంచామృతానికి బదులుగా గంగా జలం, తులసి ఆకులను కూడా ఇస్తారు. అందుకే చరణామృతం కోసం తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుతారు.
  • విశ్వాసాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను ముట్టుకోకూడదు. ఇది పవిత్రమైనప్పటికీ, ఇంటికి కొంత దూరంలో తులసిని ప్రతిష్టించడం నియమమని గుర్తుంచుకోవడం మంచిది. తులసి దేవి ఎప్పుడూ పరిశుభ్రతను ఇష్టపడుతుంది. కాబట్టి తులసి మొక్కను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పట్టించుకోకపోతే పొడిగా మారిపోతుంది. అదేవిధంగా మంగళ, ఆదివారాల్లో తులసి ఆకులనుకోయకూడదు.
  • హిందూమతంలో తులసికి తల్లితో సమానమైన స్థానం ఉంది. సంప్రదాయ హిందూ మతంలో తులసి మహిమ అపారమైనది. తులసి ఆకులను పూజ వంటలలో, ప్రసాదాలలో కూడా ఇస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..