Healthy Food: ఈ ఆహారపు అలవాట్లు చర్మానికి చాలా ప్రమాదకరం.. ఈ తప్పులు అస్సలు చేయకూడదు..

చర్మాన్ని ఆరోగ్యంగా.. ఎంతో అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ మనం తీసుకునే ఆహారపదార్థాలు.. మన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆహారం తీసుకునే ముందు చాలా

Healthy Food: ఈ ఆహారపు అలవాట్లు చర్మానికి చాలా ప్రమాదకరం.. ఈ తప్పులు అస్సలు చేయకూడదు..
Healthy Skin
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2022 | 4:18 PM

చర్మాన్ని ఆరోగ్యంగా.. ఎంతో అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ మనం తీసుకునే ఆహారపదార్థాలు.. మన చర్మంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆహారం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మానికి.. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. కానీ మనకు తెలియకుండా చేసే పోరపాట్ల వలన అనారోగ్య సమస్యలే కాకుండా.. చర్మ సమస్యలు కూడా వెంటాడుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని తప్పులు చేయడం వలన చర్మ సమస్యలు మరింత పెరుగుతాయి. అవెంటో తెలుసుకుందామా.

ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్.. ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రాసెస్ట్ ఫుడ్, వైట్ బ్రెడ్ వంటివి ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం వలన మీ గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. దీంతో చర్మం పగుళ్లకు గురవుతుంది. అలాగే చర్మంపై మంట ఏర్పడుతుంది. అందుకే ఈ రకమైన ఫుడ్ తీసుకునే వారు స్కీన్ అలెర్జీ ఉండకుండా చూసుకోవాలి.

ప్రొబయోటిక్స్ ఫుడ్స్.. మీ ఆరోగ్యానికి అలాగే.. మీ చర్మానికి మేలు చేసే ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడడంలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా సహయపడతాయి. ప్రోబయోటిక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఇవి సాధారణంగా పులియబెట్టిన ఆహారాలలో కనిపించే సూక్ష్మజీవులు. ఇవి మన శరీరం, చర్మం, మనస్సు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

అలాగే వైట్ బ్రెడ్, పాస్తా, వైట్ రైస్, సోడా వంటి వాటిలో శుద్ది చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషకాలు, పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే చర్మానికి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన చర్మంపై ముడతలు ఏర్పడి.. వయసు రాకముందే వృద్ధాప్య చాయలు కనిపిస్తాయి. అంతేకాకుండా.. మొటిమలు ఏర్పడతాయి. తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. వీటిని అధికంగా తింటే చర్మానికి హానికరం. ఇది కొల్లాజెన్ ను విచ్చిన్నం చేస్తుంది. దీంతో చర్మం వదులుగా, డల్ గా కనిపిస్తుంది. తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వలన మీ చర్మంపై రంధ్రాలు మూతపడిపోతాయి. దీంతో చర్మం పై పగుళ్లు ఏర్పడతాయి.

అధిక పరిమాణంలో కెఫిన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది చర్మ సమస్యలను పెంచుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ, లేదా టీ తీసుకోవడం వలన చర్మ సమస్యలు పెరుగుతాయి.

గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా.. వైద్యుల సూచనలు…అధ్యాయనాల నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.

Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..

‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్‌ విన్నారా.?

Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్

Ashu Reddy: లంగా వోణీ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!