Foods to Avoid: మధ్యాహ్నం భోజనంలో ఈ పదార్థాలను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసా..
సాధారణంగా మనం రోజు తీసుకునే ఆహారం మన శరీర పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రిళ్లు భోజనం చేసే సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం.
సాధారణంగా మనం రోజు తీసుకునే ఆహారం మన శరీర పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం, రాత్రిళ్లు భోజనం చేసే సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం.. ఏఏ ఆహారం తీసుకుంటున్నామనే విషయాలను శ్రద్దగా చూసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం మనం తీసుకునే ఆహారం.. రోజంతా మనం ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. అందుకే మనం తీసుకునే భోజనంలో ప్రోటీన్స్, ఆరోగ్యకరమై కొవ్వులు, ఫైబర్, పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇదే సమయంలో మధ్యాహ్నం మనం కొన్ని పదార్థాలను మాత్రం అస్సలు తీసుకోవద్దు.
ఉద్యోగాలకు.. షాపులకు వెళ్లేవారు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తారు. అలాగే మరికొందరు మధ్యాహ్నం సమయంలో పిజ్జా, బర్గర్, పాస్తా, శాండ్ విచ్ తినడానికి ఇష్టపడతారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం అస్సలు మంచింది కాదు. అవి శరీరానికి శక్తి ఇవ్వకపోవడమే కాకుండా.. అలసటను పెంచుతాయి. ఆకలిని ఏమాత్రం తీర్చవు.. దీంతో క్షణాల్లోనే మళ్లి ఆకలి వేస్తుంది. అంతేకాకుండా.. అలసట, బద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. మరీ మధ్యాహ్నం భోజనం సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దో తెలుసుకుందామా.
కూరగాయల సూప్ (వెజిటబుల్ సూప్) తక్కువ కేలరీలు, పోషకాలు ఉంటాయి. ఇందులో ప్రోటీన్ ఉండదు. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఎక్కువగా తినాలని అనిపించదు.. అందుకే మధ్యాహ్నం సమయంలో సూప్ అస్సలు తీసుకోవద్దు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఒకవేళ మీరు మధ్యాహ్న సమయంలో సూప్ తీసుకోవాలనుకుంటే చికెన్ సూప్ తీసుకోవాలి. ఇందులో లీన్ ప్రోటీన్ ఉంటుంది. చికెన్ సూప్ తోపాటు.. ఓట్స్, రైస్, యాపిల్, రోటి వంటి కాంప్లెక్స్ పదార్థాలను తీసుకోవాలి.
ఫాస్ట్ పుడ్ లో చాలా కొవ్వు ఉంటుంది. ఇది కడుపు నింపుతుంది. కానీ అలసటను, నీరసాన్ని కలిగిస్తుంది. అందుకే మధ్యాహ్న భోజనంలో ఫాస్ట్ ఫుడ్ తీసుకోవద్దు. పాస్తా.. ఇది శుద్ది చేసిన కార్బ్, ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిని తిన్న వెంటనే మంచి నిద్ర వస్తుంది. మధ్యాహ్నం భోజనంలో పాస్తాను అస్సలు తినకూడదు. కడుపు నింపుకోవడానికి మధ్యాహ్నం సమయంలో పచ్చి ఆకుకూరల రసాన్ని తాగాలని సూచిస్తుంటారు. కానీ రిజిస్టర్డ్ డైటీషియన్ నిపుణుడు విట్నీ స్టువర్డ్ ప్రకారం.. గ్రీన్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిది.. కానీ మధ్యాహ్నం సమయంలో తీసుకోవద్దు. ఎందుకంటే బ్యాలెన్స్ మీల్ లో ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు ఉండాలి. ఇది నిజంగా కడుపు నిండుగా ఉంచుతుంది. అందుకే గ్రీన్ జ్యూస్ కు బదులుగా కాంప్లెక్స్ కార్బ్ ఫుడ్ తీసుకోవాలి.
మధ్యాహ్నం భోజనంలోకి వెయించిన పదార్థాలను తీసుకోవద్దు. ఇందులో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యమైన కొవ్వులు ఉన్న పదార్థాన్ని తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అలాగే బద్దకాన్నిస్తుంది. అందువలన మధ్యాహ్నం భోజనంలో ఎప్పుడు కూడా వేయించిన ఆహారాన్ని తీసుకోవద్దు. మార్కెట్ లో లభించే ప్రీమేడ్ సాండ్ విచ్లను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇందులో చాలా ప్రిజర్వేటివ్ లు, సాస్ లు ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను కలిగించడమే కాకుండా.. బద్దకాన్నిస్తాయి.
గమనిక:- ఈ కథనం కేవలం ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా.. వైద్యుల సూచనలు…అధ్యాయనాల నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..
‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్ విన్నారా.?
Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్
Ashu Reddy: లంగా వోణీ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్