AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking methods: అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?

పాత్రలో అన్నం ఉడికిస్తే అన్నం పలుకుగా ఉండి, ముద్ద కాదని అంటారు. పైగా ఎన్నో పోషకాలు ఉండే గంజి లభిస్తుంది. ఆ గంజి తాగితే ఎన్నో పోషకాలు లభిస్తాయి. గతంలో ఈ గంజిని చాలామంది తాగేవారు.

Cooking methods: అన్నం పాత్రలో ఉడికించితే మంచిదా..? ప్రెజర్ కుక్కర్‌లో వండితే మంచిదా?
Pressure Cooker Vs Open Cooking
Ram Naramaneni
|

Updated on: Feb 23, 2022 | 3:42 PM

Share

Pressure cooker vs open cooking: మనకు ప్రధాన ఆహారం అన్నం. రోజులో ఒక్క పూటైనా అన్నం తింటే కావాల్సినంత శక్తి లభిస్తుంది. ఒకప్పుడు బియ్యాన్ని పాత్రలో నీళ్లు వేసి ఉండికించి వార్చేవారు. అందులో ఉండే గంజిని వంచేసి అన్నాన్ని తయారు చేసేవారు. అయితే, ఇప్పుడు చాలామంది ప్రెజర్ కుక్కర్లలోనే రైస్ వండుతున్నారు. పైగా ప్రెజర్ కుక్కర్లో అన్నం వండటం చాలా ఈజీ. ఇలా చెయ్యడం వల్ల అన్నం అడుగంటకుండా, మాడకుండా ఉంటుంది.  విజిల్స్ లెక్క పెట్టుకుని స్టవ్ కట్టేస్తే చాలు అన్నం రెడీ అయిపోతుంది. గంజి వంచాలి.. పొయ్యి దగ్గర కూర్చోవాలి అన్న బాధ ఉండదు. అయితే పాత్రలో అన్నం ఉడికిస్తే అన్నం పలుకుగా ఉండి, ముద్ద కాదని అంటారు. పైగా ఎన్నో పోషకాలు ఉండే గంజి లభిస్తుంది. ఆ గంజి తాగితే ఎన్నో పోషకాలు లభిస్తాయి. గతంలో ఈ గంజిని చాలామంది తాగేవారు. ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్పితే గంజి వాసన చూసేవారు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రెజర్ కుక్కర్‌లో రైస్ వండితే బెస్టా లేక పాత్రలో ఉడికించి గంజి తీసేసే అన్నం (బాయిల్డ్ రైస్‌) మంచిదా  అనే విషయంలో చాలామంది అనుమామనాలున్నాయి. ఈ విషయంపై క్లారిటీ తెలుసుకుందాం పదండి.

  1. ప్రెజర్ కుక్కర్లో అన్నం ఉడికేందుకు సరిపడా నీటిని మాత్రమే వాడతారు. కాబట్టి.. ఆవిరి ద్వారా ఎక్కువ పోషకాలు బయటకు పోయే చాన్స్ ఉండదు.
  2.  పాత్రలో అన్నం వండేటప్పుడు… కొందరు అవసరం కంటే ఎక్కువ నీటిని ఉడికించి.. ఆ గంజిని పారబోస్తారు. దీని వల్ల అందులో ఉండే పోషకాలన్నీ బయటకు పోతాయి.
  3. అన్నంలో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు మెగ్నీషియం, పోటాషియం, ఫోలేట్, పాస్ఫరస్, ఐరన్ కూడా వంటి న్యూట్రీషియన్లు ఉంటాయి. గంజి వార్చినట్లయితే.. అవన్నీ బయటకు పోతాయి.
  4. పాత్రలో వండేటప్పుడు రైస్ త్వరగా ఉడకాలనే ఉద్దేశంతో చాలామంది ముందుగా వాటిని నానబెట్టి కడుగుతారు. అలా చేసినా సరే బియ్యంలోని పోషకాలన్నీ పోతాయి.
  5. కొనుగోలు చేసిన బియ్యంలో ఎన్నోరకాల ఫంగస్ బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటిలో అఫ్లాటాక్సిన్స్లోని అనే ఫంగల్ పాయిజన్ లివర్ క్యాన్సర్‌ కలిగిస్తుంది. బియ్యాన్ని 100 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉడికించినా సరే ఈ ఫంగస్ అంతం అవ్వదు. ప్రెజర్ కుక్కర్‌లో 100 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద బియ్యం ఉడుకుతుంది. కాబట్టి.. ఆ ఫంగస్ చాలావరకు నశిస్తుంది.
  6. ప్రెజర్ కుక్కర్లో ఆవిరిపై ఉడికించే అన్నంలో 33.88 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని, పాత్రలో ఉడికించే అన్నంలో 28.17 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్లడించింది
  7. ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించే అన్నంతో పోల్చితే పాత్రలో ఉడికించే అన్నంలో కెలోరీల శాతం తక్కువ అన్నది పలు పరిశోధనల సారాంశం

కాబట్టి.. ప్రెజర్ కుక్కర్ వండిన ఆహారం తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. పైగా పోషకాలు కూడా ఎక్కువ లభిస్తాయి. కుక్కర్‌లో అన్నం శరీరానికి వేడి చేస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే. ఒక వేళ మీరు పాత్రలో అన్నం వండుతున్నా నష్టమేమి లేదు. అయితే వార్చిన గంజిని తాగితే.. అందులోని పోషకాలు మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Also Read: Cloves: లవంగాలతో దిమ్మతిరిగే ప్రయోజనాలు .. కనీసం మీ ఊహకు కూడా అందవు