Vitamin D: విటమిన్ D లోపం ఉన్నవారు ఈ పదార్థాలను తినాలి..  అవెంటో తెలుసుకోండి.. 

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు మన శరీరానికి తప్పనిసరి. అందులో విటమిన్ డీ

Vitamin D: విటమిన్ D లోపం ఉన్నవారు ఈ పదార్థాలను తినాలి..  అవెంటో తెలుసుకోండి.. 
Vitamin D
Follow us

|

Updated on: Dec 03, 2021 | 2:46 PM

సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు మన శరీరానికి తప్పనిసరి. అందులో విటమిన్ డీ వలన ఎముకల ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కంట్రెల్ అవుతాయి. మైక్రోబియల్ ఇన్‏ఫెక్షన్ వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ డీ ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాుండా.. కీళ్ల నొప్పులను కూడా నియంత్రించవచ్చు. అసలు ఈ విటమిన్ డీ అంటే ఏంటీ… విటమిన్ డీ లోపం ఉన్నవారు ఎలాంటి పదార్థాలను తీసుకోవాలో తెలుసుకుందామా.

విటమిన్ డీ.. విటమిన్ డీ ఒక స్టెరాయిడ్ హార్మోన్. ఇది సూర్య రశ్మి వలన శరీరంలో యాక్టివేట్ అవుతుంది. అలాగే ఇతర ఆహార పదార్థాలు.. డయటరీ సప్లిమెంట్స్ నుంచి కూడా వస్తుంది. కాల్షియంని గ్రహించాలంటే శరీరానికి విటమిన్ డీ అవసరం. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డీ చాలా ముఖ్యం.

విటమిన్ డీ లోపం ఉన్న పిల్లలు రికెట్స్ సమస్యతో బాధపడుతుంటే.. పెద్దవారిలో ఎముకలు పెళుసుబారుతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. విటమిన్ డీ లోపాన్ని తగ్గించాలంటే.. సూర్యరశ్మితోపాటు.. ఇతర ఆహార పదార్థాలు.. సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి.

1. విటమిన్ డీ లోపాన్ని అధిగమించడానికి.. ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకోవలి. విటమిన్ డీ గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో లభిస్తుంది. గుడ్లు తినడం వలన శరీరానికి కావాల్సినంత శక్తి కూడా లభిస్తుంది. 2. పాలల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే విటమిన్ డి, కాల్షియం రెండు పాలల్లో అధిక మొత్తంలో ఉంటాయి. ఆవు పాలలో విటమిన్ డీ ఆధిక మొత్తంలో లభిస్తుంది. ఇది శరీరానికి శక్తినిచ్చి ఎముకలను దృఢంగా మారుస్తుంది. 3. పుట్టగొడుగులలో విటమిన్ బి1, బి2, బి5, విటమిన్ సి, మెగ్నీషియం పుట్టగొడుగులలో లభిస్తాయి. అంతేకాకుండా.. విటమిన్ డీ లోపాన్ని నియంత్రిస్తాయి. 4. రోజు పెరుగు తినడం వలన విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు. అలాగే కాల్షియం కూడా లభిస్తుంది. పెరుగు ఎముకలను బలపరచడమే కాకుండా కడుపు సమస్యలను దూరం చేస్తుంది. 5. చేపల నుంచి కూడా విటమిన్ డి పొందవచ్చు. అలాగే విటమిన్ ఇ, బి12 కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి. 6. ఆరెంజ్ శరీరానికి విటమిన్ సి ఇవ్వడమే కాకుండా..విటమిన్ డీ లోపాన్ని తగ్గిస్తుంది. నారింజ పండ్లను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. 7. తృణధాన్యలలో విటమిన్ డీ అధిక మొత్తంలోఉంటుంది. విటమిన్ డీ లోపాన్ని తగ్గించడానికి గోధుమలు, బార్లీ, ఇతర ధాన్యాలను తీసుకోవచ్చు. తృణధాన్యాలు తినడం వలన ఫైబర్, ఇతర పోషకాలు అందుతాయి.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో అదిరిపోయే ట్విస్ట్ .. రీఎంట్రీ ఇవ్వనున్న రవి.. !!

మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!