Black Rice Benefits: బ్లాక్ రైస్‌తో గుండె సమస్యలకు చెక్.. ఈ సమస్యలను కూడా తగ్గిస్తాయి..
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండేందుకు బ్రౌన్ రైస్.. వైట్ రైస్ తింటున్నారు. ముఖ్యంగా
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండేందుకు బ్రౌన్ రైస్.. వైట్ రైస్ తింటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గించడంలో బ్రౌన్ రైస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ బ్లాక్ రైస్ గురించి ఎవరికైనా తెలుసా… వైట్, బ్రౌన్ రైస్ కంటే బ్లాక్ రైస్ ఆరోగ్యానికి చాలా రెట్లు మంచిది. ఈ నల్ల బియ్యాన్ని తక్కువగా సాగు చేస్తారు. అంతేకాకుండా.. చాలా మందికి ఈ రైస్ గురించి తెలియదు. కానీ ఈ నల్ల బియ్యంతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ నల్ల బియ్యంతో కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా.
వైట్, బ్రౌన్ రైస్ కంటే బ్లాక్ రైస్ లో ప్రోటీన్స్ చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అలాగే ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ నల్ల బియ్యం కూడా రుచిగా ఉంటుంది. బ్లాక్ రైస్ తీసుకోవడం వలన బలహీనత, అలసట తగ్గుతుంది. దీంతోపాటు.. అల్జీమర్స్ సమస్య కూడా తగ్గుతుంది. మధుమేహం సమస్య ఉన్నవారు ఈ బ్లాక్ రైస్ తీసుకోవచ్చు. ఇందులో ఆంథోసైనిన్ అనే మూలకం ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ తీసుకోవడం వలన బాడీ డిటాక్స్ జరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో సహయపడతాయి. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
Also Read: Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‌లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!