Health: రోజూ రన్నింగ్ చేస్తున్నారా.. అయితే మీ డైట్‌లో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..
కరోనా మన జీవితాల్లోకి వచ్చాక అందరిలో ఆరోగ్యస్పృహ ఎక్కువైంది. ముఖ్యంగా జీవనశైలికి సంబంధించి ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ను జీవితంలో భాగం చేసుకోవడం
కరోనా మన జీవితాల్లోకి వచ్చాక అందరిలో ఆరోగ్యస్పృహ ఎక్కువైంది. ముఖ్యంగా జీవనశైలికి సంబంధించి ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ను జీవితంలో భాగం చేసుకోవడం, ఆహార నియమాలపై నియంత్రణ పాటించడం ఇందులో భాగమే. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకోవడం కోసం చాలామంది జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు, ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. అది కుదరకపోతే ఇంట్లోనే జాగింగ్, వాకింగ్, రన్నింగ్ చేస్తున్నారు. ఇక బరువు తగ్గించడం కోసం మరికొందరు రన్నింగ్‌ను కూడా తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం పలు శారీరక సమస్యలు దూరమవుతాయి. మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. అయితే ఎక్కువ సమయం రన్నింగ్ చేయాలంటే శరీరానికి శక్తి చాలా అవసరం. అందుకే రన్నింగ్ చేసేవారు మంచి పోషకాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన డైట్‌ను మెనూలో చేర్చుకోవాలంటున్నారు . మరి అవేంటో తెలుసుకుందాం రండి.
నిమ్మకాయ సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలో క్యాల్షియం, విటమిన్ సి రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఎముకలను బలంగా మారస్తాయి. అందుకే రోజూ రన్నింగ్ చేసేవాళ్లు నిమ్మరసం లేదా నిమ్మతో చేసిన వంటకాలను మెనూలో చేర్చుకోవాలి.
అరటి రన్నింగ్, జాగింగ్ లాంటి వ్యాయామాలు చేసే వారికి అరటి పండు అత్యంత ఆరోగ్యకరమైనది. అరటి పండు తింటే త్వరగా కడుపు నిండుతుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అదేవిధంగా పొటాషియం, విటమిన్ బి-6 లాంటి పోషకాలు అరటిపండ్లలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.
వాల్‌నట్స్ వాల్ నట్స్ లో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫైబర్, విటమిన్-ఇ లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వాల్‌నట్ ఎముకలు దృఢంగా మారుతాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారికి వాల్‌నట్స్ మంచి ఆహారం.
చియా గింజలు చియా గింజల్లో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయి. అందువల్ల డీహైడ్రేషన్ సమస్యలు దూరమవుతాయి.
చెర్రీ చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రన్నింగ్ చేయడం వల్ల తలెత్తే ఒళ్లు నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
Also read:
Black Rice Benefits: బ్లాక్ రైస్‌తో గుండె సమస్యలకు చెక్.. ఈ సమస్యలను కూడా తగ్గిస్తాయి..
Vitamin D: విటమిన్ డీ లోపం ఉంటే చలికాలంలో ఈ సమస్యలు ప్రమాదం.. వాటి లక్షణాలను తెలుసుకోండి..
Health Tips: సీజనల్ పండ్లు, కూరగాయలతో ఆరోగ్యం పదిలం.. చలికాలంలో జస్ట్ ఈ టిప్స్ పాటించండి..