AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting Tips: మీ పిల్లలు హైట్ పెరగాలనుకుంటున్నారా.. అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తినిపించాల్సిందే

పిల్లలు ఎత్తు పెరగాలంటే.. శారీరక శ్రమ, చురుకు దనం ఉండటం చాలా ముఖ్యం. నేడు పిల్లల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో పిల్లల్లో తగిన ఎత్తు ఎదగలేకపోతున్నారు. 

Parenting Tips: మీ పిల్లలు హైట్ పెరగాలనుకుంటున్నారా.. అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ తినిపించాల్సిందే
Children Health Tips
Basha Shek
|

Updated on: Nov 09, 2022 | 7:47 PM

Share

తల్లిదండ్రులు తమ పిల్లలను ఆరోగ్యంగా పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వారు పొడవుగా పెరిగేందుకు వివిధ వ్యాయామాలు చేస్తుంటారు. అయితే పిల్లల ఎత్తు కూడా వారి తల్లిదండ్రుల ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు పొడవుగా ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లల హైట్‌గా ఉండరు. దీని కారణంగా చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలకి సరైన పోషకాహారం అందకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు.  అలాగే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు ఎత్తు పెరగాలంటే.. శారీరక శ్రమ, చురుకు దనం ఉండటం చాలా ముఖ్యం. నేడు పిల్లల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండడంతో పిల్లల్లో తగిన ఎత్తు ఎదగలేకపోతున్నారు.  మరి మీ పిల్లలు హైట్ పెరగాలనుకుంటే వ్యాయామంతో పాటు ఆహారంలో ఏం చేర్చాలో తెలుసుకుందాం రండి.

తృణధాన్యాలు

పిల్లలు ఆహారంలో తృణధాన్యాలు చేర్చడం చాలా ముఖ్యం. తృణధాన్యాలలో విటమిన్-బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, చర్మం, కండరాలకు ఈ రెండూ చాలా అవసరం. అదేవిధంగా పిల్లల ఆహారంలో తృణధాన్యాలు చేర్చడం వల్ల పిల్లల ఎత్తు పెరగడమే కాకుండా కండరాలు బలపడతాయి.

పాలు

ఎముకల దృఢత్వానికి కాల్షియం అత్యంత ముఖ్యమైనది. పాలు కాల్షియం ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. ఇందుకోసం పిల్లలకు ప్రతిరోజూ కనీసం ఒకటి, గరిష్టంగా మూడు గ్లాసుల పాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల ఎత్తు పెరగడంతోపాటు ఎముకలు కూడా దృఢంగా మారుతాయి.

ఇవి కూడా చదవండి

చేపలు

చేపలలో ప్రోటీన్ నిల్వ ఉంది. మీరు పిల్లలకు క్రమం తప్పకుండా చేపలను తినిపిస్తూ ఉంటే, అప్పుడు పిల్లల ఎత్తు ఖచ్చితంగా పెరుగుతుంది.

సోయాబీన్

సోయాబీన్‌లో అత్యధిక ప్రొటీన్ ఉంటుంది. ఇది పిల్లల శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. పిల్లల ఎత్తును పెంచడంతో పాటు, పిల్లల ఎముకలు, కండరాల బలంపై కూడా శ్రద్ధ చూపడం అవసరం. కాబట్టి పిల్లల ఆహారంలో సోయాబీన్‌ను చేర్చండి.

ఉసిరి

పిల్లల ఎత్తును పెంచడంలో ఉసిరికాయ బాగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంతో పాటు, మనసును కూడా ప్రశాంతగా ఉంచుతుంది.

Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..