AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీల్ మేకర్ మీరు కూడా తింటున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!

మీల్ మేకర్ అనేది ప్రోటీన్‌ అధికంగా కలిగిన శాకాహార ఆహారం. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు కండరాల బలాన్ని పెంచుతుంది. అయితే దీన్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మీల్ మేకర్ ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మీల్ మేకర్ మీరు కూడా తింటున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!
Side Effects Of Meal Maker
Prashanthi V
| Edited By: |

Updated on: Mar 05, 2025 | 7:39 PM

Share

మీల్ మేకర్ అనేది ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కలిగి ఉన్న ఒక పోషకాహారం. ప్రతి 100 గ్రాములలో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శరీరానికి కావలసిన ప్రోటీన్‌ ను అందిస్తుంది. అందువల్ల కోడిగుడ్లు, మాంసం వంటి ఆహారాలకు సమానంగా దీనిని పరిగణించవచ్చు. మీల్ మేకర్ తినడం ద్వారా మన ఆరోగ్యానికి మేలుచేస్తుంది.

మీల్ మేకర్‌ లో ఉన్న ప్రోటీన్, ఫైబర్ మన శరీరానికి బలాన్నిస్తుంది. శరీరంలోని కండరాలు బలపడేందుకు, శక్తి పెరగడానికి ఈ ఆహారం సహాయపడుతుంది. ఈ ఆహారంలో ఉండే విటమిన్లు, మినరల్స్ అనేవి శరీరానికి అవసరమైన పోషకాలుగా పనిచేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని విటమిన్ లోపాలను తీరుస్తాయి. ఈ ఆహారం తినడం ద్వారా శారీరక శక్తి పెరుగుతుందంటూ నిపుణులు చెబుతున్నారు.

మగవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా మీల్ మేకర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఛాతి పరిమాణం పెరగడం వంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే అధిక ప్రోటీన్‌ తీసుకోవడం వల్ల విరోచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండవచ్చు. అందుకే మగవారు ఈ ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మహిళలు ఈ ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే చర్మంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మొటిమలు వంటి సమస్యలు రావచ్చు. ఈ ఆహారంలోని కొన్నిరకాల పోషకాలు అధిక మోతాదులో ఉండటంతో శరీరంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కనుక మహిళలు కూడా ఈ ఆహారాన్ని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీల్ మేకర్ తినే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ ఆహారాన్ని ఓ పౌషక ఆహారం అనిపించే స్థాయిలో మాత్రమే తీసుకోవాలి. అత్యధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పొందడంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా దీని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us