Onion: పచ్చి ఉల్లితో పిచ్చెక్కే బెనిఫిట్స్.. రోజూ 2 ముక్కలు తినేయండి
ఉల్లిపాయలలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ సమాచారం తెలుసుకుందాం పదండి...
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. అందులో వాస్తవం లేకపోలేదు. మన శరీరానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. అందరి కిచెన్స్‌లో కూడా ఉల్లి ఎంతో ముఖ్యమైన పదార్థం. ఉల్లిపాయలు కేవలం రుచి కోసం మాత్రమే కాదు. దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే వంటల్లో వినియోగించడం మాత్రమే కాదు. ఉల్లిపాయను పచ్చిగా తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం..
1. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది: ఉల్లి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించే, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే రసాయనాన్ని కలిగి ఉంటుంది.
2. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది: ఉల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యానికి అడ్డుకట్ట వేస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించి.. ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహిస్తుంది.
3. బరువు తగ్గడంలో సాయం: ఉల్లిపాయ తక్కువ కాలరీ, అధిక ఫైబర్ కలిగిన ఆహారం. దీన్ని తింటే ఎక్కువసేపు మీ కడుపు నిండుగా ఉంటుంది. ఇది కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.
4. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్, క్వెర్సెటిన్ అనే రెండు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇది బోలు ఎముకల వ్యాధి అవకాశాలను తగ్గిస్తుంది.
5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయలలోని సల్ఫర్-కలిగిన భాగాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
6. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది: ఉల్లిపాయలలో ఉండే ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో సహాయపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. పచ్చి ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. సరైన జీర్ణక్రియకు, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి ఇది చాలా ముఖ్యమైనది.
7. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు: ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, అలెర్జీల లక్షణాలను తగ్గిస్తుంది.
8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: నివేదికల ప్రకారం, ఉల్లిపాయలలో ఉండే సల్ఫర్ కలిగిన రసాయనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి.
9. మెదడు పనితీరును పెంచుతుంది: పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇది మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత స్థాయిలకు ఉపకరిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..