AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Covid Problems: వెంటాడుతున్న పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు.. మీకు ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాల్సిందే

గతంలో కరోనా సోకిన వారిని పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకు  ఎక్కువ శాతం మంది ప్రజలు గురువుతున్నారు. అయితే ఇవన్నీ భయాలే అని కొంతమంది వైద్యులు కొట్టిపారేస్తున్నారు. అయితే గతంలో కరోనా సోకిన వారిక కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Post Covid Problems: వెంటాడుతున్న పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు.. మీకు ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాల్సిందే
Covid 19
Nikhil
|

Updated on: Apr 18, 2023 | 9:00 PM

Share

కరోనా మహమ్మారి ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంటుంది. ప్రస్తుత కాలంలో కరోనా కేసుల పెరుగుదల చూస్తే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడుతున్నారు. మూడేళ్ల క్రితం నుంచి కరోనా సృష్టిస్తు‍న్న కల్లోలం అంతా ఇంత కాదు. అయితే కరోనా ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా విలయాన్ని సృష్టించింది. చాలా మంది కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలోనే ఎక్కువగా కరోనా సమస్యకు గురయ్యారు. సరైన పౌష్టికాహారం, నివారణ చర్యలతో కరోనా నుంచి గట్టెక్కారు. అలాగే ప్రభుత్వం కూడా కరోనాకు వ్యాక్సిన్‌ అందించడంతో ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకున్నారు. అయితే గతంలో కరోనా సోకిన వారిని పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకు  ఎక్కువ శాతం మంది ప్రజలు గురువుతున్నారు. అయితే ఇవన్నీ భయాలే అని కొంతమంది వైద్యులు కొట్టిపారేస్తున్నారు. అయితే గతంలో కరోనా సోకిన వారిక కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణులు తెలిపే ఆ విషయాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

కోవిడ్ తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రపడుతుందో? లేదో? గమనించాలనిపేర్కొంటున్నారు. కరోనా కోవిడ్‌తో ఆసుపత్రిలో చేరిన రోగుల్లో అసందర్భ నిద్ర విధానాలు శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు.యూకేలో దాదాపు 38 సంస్థల్లోని రోగులపై జరిపిన అధ్యయనంలో 62 శాతం కోవిడ్ రోగులకు నిద్ర అంతరాయం ఉందని తేలింది. కరోనా సోకిన కనీసం 12 నెలల పాటు ఈ స్థితి కొనసాగే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగుల్లో సమయాణుగుణ నిద్ర దాదాపు 19 శాతం తగ్గింది. అలాగే ఆందోళనతో పాటు కండరాల బలహీనత కూడా వారిని వేధిస్తుందని అధ్యయనంలో తేలింది. 

కండరాల పనితీరు తగ్గడం, ఆందోళనతో సంబంధం ఉన్నందున నిద్ర భంగం అనేది పోస్ట్ కోవిడ్ నిపుణులు పేర్కొంటున్నా. అలాగే శ్వాస ఆడకపోవడం లేదా డిస్ప్నియా వంటి లక్షణాలు కూడ కరోనా రోగులు కలిగి ఉంటారని చెబుతున్నారు. సాధారణంగా శ్వాస ఆడపోవడమే నిద్ర భంగానికి ప్రధాన కారణంగా ఉంటుంది. ఎందుకంటే పడుకునే సమయంలో సరైన మోతాదు గాలి పీల్చుకోపోతే వెంటేనే మెలకువ వచ్చేస్తుంది. కాబట్టి నిద్రాభంగం కలుగుతుంది. ఇలాంటి రోగుల్లో ఆందోళనను తగ్గించడంతో పాటు కండరాల బలాన్ని మెరుగుపరచడం ద్వారా నిద్రకు అంతరాయం నుంచి బయటపడవచ్చి నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై తదుపరి పరిశోధనలు కూడా అవసరమని కూడా పరిశోధకులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం