AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: మీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే గుండె సమస్యలు దూరం.. అవేంటో తెలుసుకోండి

అథెరోస్క్లెరోసిస్ అని పిలిచే వ్యాధి గుండె ధమనుల గోడల్లో ఫలకం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఈ వ్యాధి అవయవాలు, కణజాలాలకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. ఒక్కోసారి పూర్తిగా నిరోధిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గుండెపోటుకు గురవుతాడు. ఫలకం అంటే కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్, కాల్షియం, ఇతర పదార్థాల కలయికగా ఉంటుంది. ఇది కాలక్రమేణా మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా ధమనుల గోడల్లో పేరుకుపోతుంది.

Heart Health: మీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే గుండె సమస్యలు దూరం.. అవేంటో తెలుసుకోండి
Heart
Nikhil
|

Updated on: Apr 18, 2023 | 9:30 PM

Share

మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం ఆరోగ్య సమస్యలు అందరినీ వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఆహార అలవాట్ల కారణంగా మన శరీరంలో ముఖ్యమైన అవయువమైన గుండె ఎక్కువగా ప్రభావితమవుతుంది. అథెరోస్క్లెరోసిస్ అని పిలిచే వ్యాధి గుండె ధమనుల గోడల్లో ఫలకం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఈ వ్యాధి అవయవాలు, కణజాలాలకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. ఒక్కోసారి పూర్తిగా నిరోధిస్తుంది. దీంతో ఆ వ్యక్తి గుండెపోటుకు గురవుతాడు. ఫలకం అంటే కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్, కాల్షియం, ఇతర పదార్థాల కలయికగా ఉంటుంది. ఇది కాలక్రమేణా మనం తీసుకునే ఆహార పదార్థాల కారణంగా ధమనుల గోడల్లో పేరుకుపోతుంది. ఇలా ధమనుల గోడల్లో ఫలకం పేరుకుపోవడం వల్ల గుండె సంబంధ రోగాలు వస్తాయని వైద్యు నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, మధుమేహం, ఊబకాయం, నిశ్చల జీవనశైలితో సహా అడ్డుపడే ధమనుల అభివృద్ధికి దోహదపడే అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి.  ముఖ్యంగా ధమనులను ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. అలాగే ధూమపానానికి దూరంగా ఉండడంతో పాటు అంతర్లీన వైద్య పరిస్థితులను నిర్వహించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ధమనుల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలని పేర్కొంటున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి నిపుణులు సూచించే ఆ ఆహార పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

చేపలు

చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సాయం చేస్తాయి. అడ్డుపడే ధమనుల ప్రమాదాన్ని తగ్గించడంలో చురుగ్గా పని చేస్తాయి.

గింజలు

బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు వంటి నట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ధమనులు అడ్డుపడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

బెర్రీలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంతో పాటు అడ్డుపడే ధమనుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కూరగాయలు

బ్రోకలీ, బచ్చలికూర వంటి కూరగాయలలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, వాపును తగ్గించడానికి, అలాగే అడ్డుపడే ధమనులను నిరోధించడంలో సహాయపడతాయి.

తృణధాన్యాలు

వోట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు ఫైబర్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇది ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అడ్డుపడే ధమనుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అవోకాడో

అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది 

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు అడ్డుపడే ధమనుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం