Coronavirus: కొవిడ్ నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తులపై కరోనా మచ్చలు… గుర్తించిన నిపుణులు..

ఇదేం విచిత్రమో. కొందరికి కరోనా లక్షణాలుంటున్నాయి. టెస్ట్ చేస్తే నెగెటివ్ వస్తోంది. మాకు పాజిటివ్ ఏం లేదులే అనుకునే లోపే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోంది.

Coronavirus:  కొవిడ్ నెగెటివ్ వచ్చినా ఊపిరితిత్తులపై కరోనా మచ్చలు... గుర్తించిన నిపుణులు..
Post Covid Lung Fibrosis
Ram Naramaneni

|

Apr 14, 2021 | 3:15 PM

ఇదేం విచిత్రమో. కొందరికి కరోనా లక్షణాలుంటున్నాయి. టెస్ట్ చేస్తే నెగెటివ్ వస్తోంది. మాకు పాజిటివ్ ఏం లేదులే అనుకునే లోపే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోంది. ఆసుపత్రిలో సరైన చికిత్స అందితే సరే. లేకపోతే టపాటపా వికెట్లు రాలుతున్నాయి. ఆలోచించే లోపే అంతా అయిపోతోంది. కరోనా సెకండ్ వేవ్ లో ఎదురవుతున్న ఉదంతాలివి. కరోనా లక్షణాలున్న వ్యక్తికి ఆర్టీ-పీసీఆర్‌ టెస్టుల్లో కొంతమందికి నెగెటివ్‌ వచ్చింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. నెగెటివ్‌ రావడంతో ఇటీవల సీటీ స్కాన్‌ చేయించుకున్నారు కొందరు. వాటిని విశ్లేషించిన వైద్య నిపుణులకు భయంకర నిజాలు తెలిశాయి. ఊపిరితిత్తులపై బూడిదరంగు మచ్చలుంటున్నాయి. కరోనా సోకితేనే ఇలా మచ్చలు వస్తాయంటున్నారు వాళ్లు. ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన ఇంకొందరకి బ్రాంకో అల్విఓలర్‌ లావాజ్‌ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌ గా తేలింది. ఇది ముక్కు, గొంతు మార్గాల ద్వారా వైరస్‌ ప్రవేశించకపోయి ఉండొచ్చు అనే చర్చ సాగుతోంది. ఆ భాగాల నుంచి సేకరించిన స్రావాలను పరీక్షిస్తే పాజిటివ్‌ రావడం లేదేమో అని వైద్య నిపుణులు అంటున్నారు.

కరోనావైరస్ సోకితే ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం సోకుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఆ సమస్య మరింత తీవ్రమైతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది నిజం అని చెప్పేందుకు కరోనావైరస్ సోకిన వారి ఊపిరితిత్తులపై మచ్చలను చూపుతున్నారు. కోవిడ్ -19 బారిన పడిన తీవ్ర అనారోగ్యంకు గురై ఆపై కోలుకున్న వారి పై పరిశోధనలు చేయగా ఈ విషయం నిర్ధారణ అయ్యింది.  వారు డిశ్చార్జ్ అయిన తర్వాత 6, 12, 24 వారాలకోసారి శ్వాసకోశ వ్యవస్థ పరిశీలన చేశారు. పేషెంట్ల ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అనేది క్రమంగా తగ్గుతున్నట్లు గుర్తించారు.  ఆరువారాల తర్వాత తీసిన సీటీ స్కాన్‌లో దాదాపు 88 శాతం మంది పేషెంట్లలో ఊపిరితిత్తుల డ్యామేజ్ 12 వారాల తర్వాత తీసిన సీటీ స్కాన్‌లో 56శాతం మంది పేషెంట్లలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడ్డట్లు గుర్తించారు.  ఆస్ట్రియా, ఫ్రాన్స్‌లో ఈ అధ్యయనం జరిగింది.

కోవిడ్ లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతున్న వారి సీటీ స్కాన్‌ను పరిశీలించారు నిపుణులు.  20 నుంచి 30శాతం కేసుల్లో ఊపిరితిత్తులపై కరోనా మచ్చలు ఉన్నట్లు గుర్తించారు.  ఊపిరితిత్తులపై ఉన్న ఈ మచ్చలకు మందు శరీరంలోని రోగనిరోధక శక్తి మాత్రమే అని చెబుతున్నారు. కొన్ని కేసుల్లో మాత్రం ఊపిరితిత్తులకు ఎలాంటి హాని కలగలేదని పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలిపారు. కొన్ని కేసుల్లో మాత్రం కరోనావైరస్ మచ్చలు ఉన్నట్లు నిర్ధారించారు. కరోనా తగ్గినా కూడా పూర్తిస్థాయిలో ఊపిరితిత్తుల వ్యాకోచం పూర్తిస్థాయిలో ఉండటం లేదు. కరోనా వచ్చిపోయిన తర్వాత కొందరిలో ఊపిరితిత్తుల్లో మచ్చలు (పల్మనరీ ఫైబ్రోసిస్‌) ఉన్నట్లు గుర్తించారు.  ఇన్‌ఫెక్షన్‌ తగ్గితే మచ్చలు మానిపోవాలి.. కానీ కొందరిలో వైరస్‌ తీవ్రత కారణంగా దీర్ఘ కాలంగా ఈ మచ్చలు ఉంటున్నాయి.  ఈ మచ్చలు మానకపోతే పుండుగా మారే ప్రమాదం ఉంది. ఆపైన ఊపిరిత్తులు సాగే గుణం కోల్పోయి, కుంచించుకుపోవడం జరుగుతుంది. మచ్చలు నయంకాకపోతే కరోనా తగ్గిన 4 నెలల తర్వాత ఆయాసం మొదలవుతుంది. మెట్లు ఎక్కడంలో ఆయాసం, కొద్ది దూరం నడవగానే ఊపిరి తీసుకోవడం కష్టమై కూలబడి పోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.  వీరు నెల నుంచి నెలన్నర పాటు వెంటిలేటర్‌పై ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read: కొరతా, వివక్షా…? వ్యాక్సిన్‌ సరఫరాలో తెలంగాణపై చిన్నచూపు..! వివరాలు ఇవిగో

పురుషులే ఇలా… ఈ ఫోటో వెనుక అర్థం వేరు, పరమార్థం వేరు.. స్టోరీ చదివితే ఆ వ్యక్తులకు హ్యాట్సాఫ్ చెబుతారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu