Summer Tips: ఈ 6 ఆహారాలు వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి

Summer Tips: వేసవి కాలం వచ్చేసింది. మీరు ఆహారంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. హీట్ స్ట్రోక్ (Heat Stroke), డీహైడ్రేషన్ (Dehydration)..

Summer Tips: ఈ 6 ఆహారాలు వేసవిలో డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి
Follow us
Subhash Goud

|

Updated on: Mar 24, 2022 | 6:12 PM

Summer Tips: వేసవి కాలం వచ్చేసింది. మీరు ఆహారంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. హీట్ స్ట్రోక్ (Heat Stroke), డీహైడ్రేషన్ (Dehydration) సమస్య ఈ సీజన్‌లో సర్వసాధారణం. హైడ్రేటెడ్ గా ఉండేందుకు తగినంత నీరు తాగాలని సూచించారు. రోజూ కనీసం 8 గ్లాసుల నీరు (Water) తాగాలని సిఫార్సు చేయబడింది. కొన్నిసార్లు నీరు (హైడ్రేటింగ్ ఫుడ్స్ ) మాత్రమే తాగడం సరిపోదు. కానీ నీరు అధికంగా ఉండే ఆహారాలు (Food)కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. మీరు నీరు అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో పుచ్చకాయ, టొమాటో, దోసకాయ, స్ట్రాబెర్రీ మొదలైన ఆహారాలు ఉన్నాయి. నీటిలో సమృద్ధిగా ఉండే ఇతర ఆహారాలు ఏవి తీసుకోవచ్చో తెలుసుకుందాం.

  1.  ఆపిల్: ఇందులో దాదాపు 80 శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
  2.  టొమాటో: ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. దీనిని సాధారణంగా కూరలో ఉపయోగిస్తారు. టొమాటోలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.
  3. దోసకాయ: దోసకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది హీట్‌స్ట్రోక్‌ను నివారించగలదు. దోసకాయ మెదడుకు కూడా మేలు చేస్తుంది. నిజానికి, దోసకాయలో ఫిసెటిన్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్ ఉంటుంది. ఇది మెదడు మెరుగైన పనితీరుకు తోడ్పడుతుంది.
  4. పుచ్చకాయ: ఇది చాలా రుచికరమైనది. వేసవి కాలంలో ఎక్కువగా ఇష్టపడే పండ్లలో ఇదొకటి. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది హీట్‌స్ట్రోక్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పండు గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
  5. స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. వీటిలో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మధుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలతో పోరాడడంలో సహాయపడతాయి.
  6. పుట్టగొడుగులు: ఇందులో విటమిన్లు B2, D వంటి పోషకాలకు మంచి మూలం. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. మీరు ఈ కూరగాయలను క్రమం తప్పకుండా తినవచ్చు. ఇది అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి:

Women Heart Attack: గుండెపోటు మరణాలు పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ.. తాజా పరిశోధనలలో సంచలన విషయాలు

Side Effects of Soft Drinks: శీతల పానీయాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి..?

Heat Stroke: హీట్‌ స్ట్రోక్‌ అంటే ఏమిటి..? ఇది వస్తే శరీరంలోని ఏయే అవయవాలు దెబ్బతింటాయి..?

Health Tips: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..!