Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి బొప్పాయి తింటే కండరాలు పెరుగుతాయా..? ఆరోగ్యానికి మంచిదే కానీ..!

మామిడి పండ్లు, బొప్పాయి వంటి పండ్లు కండరాల అభివృద్ధికి ప్రోటీన్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయా అనే సందేహం చాలా మందికి ఉంది. వీటిలో ఉండే పోషక విలువలు, ప్రయోజనాలు, ఎంత తినాలి అనే ప్రశ్నలకి నిపుణులు ఏం సమాధానాలు చెబుతున్నారో తెలుసుకుందాం ఇప్పుడు.

మామిడి బొప్పాయి తింటే కండరాలు పెరుగుతాయా..? ఆరోగ్యానికి మంచిదే కానీ..!
Mangoes And Papayas For Health
Follow us
Prashanthi V

|

Updated on: Feb 05, 2025 | 9:44 PM

డిజిటల్ క్రియేటర్ టెడ్ కార్ మామిడి, బొప్పాయి కండరాల అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీని గురించి తెలుసుకోవడానికి నిపుణులను సంప్రదించగా కండరాల అభివృద్ధికి ప్రోటీన్ చాలా ముఖ్యమని తెలిపారు. మామిడి, బొప్పాయి ప్రోటీన్‌కు ప్రత్యామ్నాయం కాదని తెలిపారు.

బొప్పాయి

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. దీని ద్వారా మీరు తీసుకునే ప్రోటీన్ మీ శరీరంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి వ్యాయామం వల్ల కలిగే కండరాల నొప్పుల నుండి కోలుకోవడానికి సహాయపడతాయి.

మామిడి

మామిడిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రోటీన్ కానప్పటికీ వ్యాయామాలకు అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇది కారుకు నింపే ఇంధనం లాగా పనిచేస్తుంది. మామిడిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ఎంత తినాలి..?

వారంలో మూడు లేదా నాలుగు సార్లు 150 నుండి 160 గ్రాముల వరకు మామిడిపండు తినవచ్చు. అదేవిధంగా 140 నుండి 150 గ్రాముల వరకు బొప్పాయి పండ్లను తినవచ్చు.

మామిడి, బొప్పాయి ఆరోగ్యానికి మంచివే.. కానీ అవి ప్రోటీన్‌కు ప్రత్యామ్నాయం కావు. సరైన ప్రోటీన్ కలిగిన ఆహారాలతో కలిపి వీటిని తీసుకోవాలి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి లిమిటెడ్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!