పిల్లలకు తల్లిపాలు ఎంత కాలం ఇస్తే మంచిది.. వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..!

అమ్మపాలుఅమృతం వంటివంటుంటారు. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు, తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు..

పిల్లలకు తల్లిపాలు ఎంత కాలం ఇస్తే మంచిది.. వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 02, 2021 | 9:45 AM

అమ్మపాలుఅమృతం వంటివంటుంటారు. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు, తల్లిపాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. తల్లి పాల వారోత్సవాలు ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి నిర్వహిస్తారు.

తల్లిపాలతో కలిగే లాభాలు:

పిల్లలకు ఐదేళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు మరింతగా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు. శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్ఎస్) చెబుతోంది.

అయితే తల్లిపాలను ఏ వయసు ఆపేయాలన్నదానిపై ఎన్‌హెచ్‌ఎస్‌ నిర్ధష్ట సూచనలు ఏమి చేయలేదు. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుంచి ఆరోగ్య కారణాల దృష్ట్యా తల్లిపాలతోపాటు ఘన పదార్థాలు తినిపించాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు.

తల్లిపాలతో ఇన్ఫెక్షన్లు దూరం..

తల్లిపాలు పట్టించడం వల్ల శిశుకు ఇన్‌ఫెక్షన్ల నుంచి, రక్షణ డయేరియా, వాంతుల సమస్య నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పిల్లలు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల దూరం రక్షించుకోవచ్చు. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. శిశువు రెండో సంవత్సరంలోకి వచ్చాక, తల్లిపాలు ఇవ్వడంతోపాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని ఎన్‌హెచ్‌ఎస్ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటేమిటి?

రెండేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. రెండు సంవత్సరాల తర్వాత కూడా తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాలపరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమని, ఇలా చెప్పేందుకు ఆధారాలు పరిమితంగా ఉన్నాయని లండన్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్’కు చెందిన వైద్యులు చెబుతున్నారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి శిశువుకు కావాల్సిన పోషకాలు శిశువు తీసుకొనే ఇతర ఆహారంతో అందాలని పేర్కొంటున్నారు.

పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా..?

పాలు పట్టించడాన్ని కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయాన్ని చాలా అంశాల ప్రాతిపదికగా మహిళలు నిర్ణయించుకుంటారు. పాలు ఇవ్వడంలో సౌకర్యం, అసౌకర్యం, కుటుంబ సభ్యులు, తిరిగి ఉద్యోగ విధుల్లో చేరాల్సి ఉండటం, తదితర కారణాలను బట్టి వారు నిర్ణయానికి వస్తారు. బ్రిటన్‌లో శిశువు పుట్టాక దాదాపు 80 శాతం మంది మహిళలు కొన్ని వారాలపాటు పాలు ఇస్తారు. తర్వాత చాలా మంది ఆపేస్తారు.

ఇవీ కూడా చదవండి:

Mother Milk: తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలతో బిడ్డకు ఆరోగ్యం.. ఈ పాలతో ఎలాంటి ప్రయోజనాలంటే..!

Dates In Mansoon: వర్షాకాలంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. రోజూ కనీసం ఐదు తినమంటున్న న్యూట్రిషియన్లు