Mother Milk: తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలతో బిడ్డకు ఆరోగ్యం.. ఈ పాలతో ఎలాంటి ప్రయోజనాలంటే..!
Mother Milk: అమ్మపాలు అమృతం వంటివి. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు, తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి..
Mother Milk: అమ్మపాలు అమృతం వంటివి. నవజాతి శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు, తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే తల్లి పాలల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. అవి శిశువు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుట్టిన తరువాత గంటలోగా బిడ్డకు అందిం చే ముర్రుపాలు సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయి. అందుకే తల్లిపాలను అమృతంతో పోలుస్తారు. డబ్బా పాలు పట్టకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరో నా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ పాలు ఎలా పట్టాలని అధికారులు బాలింతలకు అవగాహన కల్పించనున్నారు. కాగా, తల్లి పాల వారోత్సవాలు ప్రతి ఏడాది ఆగస్టు 1 నుం చి నిర్వహిస్తారు. కానీ, ఈ సారి ఆదివారం వచ్చినందున సోమవారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కానున్నా యి. 7వ తేదీ వరకు మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించనున్నారు.
తల్లిపాలతో ప్రయోజనాలు:
తల్లిపాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ పాల ద్వారా ఎలాంటి ఉపయోగాలున్నాయో కూడా అధికారులు అవగాహన కల్పిస్తారు. పుట్టిన గంటలోగా బిడ్డకు పట్టే ముర్రుపాలు ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. లేత పసుపుపచ్చ రంగుతో కూడిన పాలను ఇవ్వడం వల్ల పసికందు మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, చర్మ సంబంధ వ్యాధులు, ఉబ్బసం, ఆస్తమా, బీపీ, షుగర్ ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అంతేకాదు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరు నెలలపాటు రోజూ బిడ్డకు 12 సార్లు తాగించాలి. స్థూలకాయం వచ్చే అవకాశాలు తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది..
బిడ్డను ప్రసవించిన అనంతరం ముర్రుపాలు పట్టించడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలతో బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తల్లికి కూడా ఇన్‌ఫెక్షన్లు రావు. అలాగే తల్లికి రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్ వంటివి రావు. తల్లి పాలు పట్టించడంతో బిడ్డ మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఇందుకోసమే బిడ్డకు తల్లి పాలు పట్టించాలి.