Health Care Tips: రాత్రుల్లో పాదాలలో నొప్పిగా ఉందా..? ఇలా చేయండి అద్భుతమైన ఫలితాలు

Leg Pain Home Remedies Tips: ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా శరీరంలో రకరకాల నొప్పిలు, వాపులు తలెత్తుతుంటాయి. అలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా..

Health Care Tips: రాత్రుల్లో పాదాలలో నొప్పిగా ఉందా..? ఇలా చేయండి అద్భుతమైన ఫలితాలు
Leg Pain
Follow us

|

Updated on: Nov 01, 2022 | 8:45 AM

Leg Pain Home Remedies Tips: ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా శరీరంలో రకరకాల నొప్పిలు, వాపులు తలెత్తుతుంటాయి. అలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక చాలా మందికి రాత్రి పడుకునే ముందు పాదాలలో నొప్పిగా ఉంటుంది. పాదాలలో నొప్పి అనేది ఈ రోజుల్లో సాధారణమైన సమస్య అయినా.. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నొప్పి, వాపుల నుంచి ఉపశమనం కలుగాలంటే పలు చిట్కాలు పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

  1. ప్రతిరోజూ యోగా చేయండి: రోజూ యోగా చేయడం ద్వారా మీరు పాదాల నొప్పి నుండి చాలా ఉపశమనం పొందుతారు. యోగా చేయడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మీ పాదాలలో లేదా మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు కాలు తిమ్మిరిని తగ్గించడానికి బౌండ్ యాంగిల్, డాల్ఫిన్, ఈగిల్ లేదా ఎక్స్‌టెండెడ్ సైడ్ యాంగిల్ అన్ని చేయవచ్చు.
  2. ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె: ఆపిల్ సైడర్ వెనిగర్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనాల్జేసిక్ గుణాలు ఉన్నాయి. ఇది పాదాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, అర టీస్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  3. మెంతులు: మెంతులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లిమెటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇది మంచి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా మెంతులను నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక చెంచా మెంతి గింజలను కూడా నమలవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులను కూడా దూరం చేసుకోవచ్చు.
  4. మస్టర్డ్ ఆయిల్ తో మసాజ్: మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలను బాగా మసాజ్ చేయండి. ఇది మీకు నొప్పి నుండి చాలా ఉపశమనం ఇస్తుంది.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయుర్వేద నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..