Gum Care Tips: శీతా కాలంలో చిగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. వీటితో చెక్ పెట్టండి!
శీతా కాలంలో చాలా మంది దంత సమస్యలతో ఇబ్బంది పడతారు. చలి కాలంలో చాలా మందికి చిగుళ్లు సమస్య వేధిస్తుంది. చిగుళ్లలో ఇబ్బంది ఏర్పడి.. దంతాలకు డ్యామేజ్ కూడా అవుతుంది. నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోయినా.. ఆహారం తీసుకున్న తర్వాత శుభ్రం చేసుకోకపోయినా.. బ్యాక్టీరియా చేరి చిగుళ్ల సమస్యకు దారి తీస్తుంది. దీంతో చిగుళ్లలో నొప్పి, రక్త స్రావం కలుగుతుంది. ఈ చిగుళ్ల సమస్యను ముందుగానే గుర్తించాలి. లేదంటే అనంతరం చాలా సమస్యలను ఎదుర్కొనాల్సి..

శీతా కాలంలో చాలా మంది దంత సమస్యలతో ఇబ్బంది పడతారు. చలి కాలంలో చాలా మందికి చిగుళ్లు సమస్య వేధిస్తుంది. చిగుళ్లలో ఇబ్బంది ఏర్పడి.. దంతాలకు డ్యామేజ్ కూడా అవుతుంది. నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోయినా.. ఆహారం తీసుకున్న తర్వాత శుభ్రం చేసుకోకపోయినా.. బ్యాక్టీరియా చేరి చిగుళ్ల సమస్యకు దారి తీస్తుంది. దీంతో చిగుళ్లలో నొప్పి, రక్త స్రావం కలుగుతుంది. ఈ చిగుళ్ల సమస్యను ముందుగానే గుర్తించాలి. లేదంటే అనంతరం చాలా సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా.. చిగుళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పసుపు:
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న విషయం విదితమే. ఇది బ్యాక్టీరియా దరి చేరకుండా చూడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చిగుళ్ల సమస్యను తగ్గిస్తాయి. చిగుళ్ల సమస్యతో ఇబ్బంది పడేవారు పసుపులో కొద్దిగా ఆవాల నూనె కలిపి చిగుళ్లపై రాసి.. మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఉప్పు నీటితో..
చిగుళ్లు, దంత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉప్పు నీటితో చెక్ పెట్టొచ్చు. ఉప్పులో క్రిమి నాశక గుణాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల వాపును, రక్త స్రావం కలిగిచే ఇన్ ఫెక్షన్ ను తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిని.. నోట్లో వేసి బాగా పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చిగుళ్ల సమస్యలు తగ్గి పోతాయి.
తేనె..
తేనెతో కూడా చిగుళ్ల సమస్యను తగ్గించు కోవచ్చు. కొద్దిగా తేనె తీసుకుని.. చిగుళ్లపై సున్నితంగా మసాజ్ చేయాలి. అయితే గట్టిగా రుద్ద కూడదు. తేనెలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చూస్తాయి.
ఆయిల్ పుల్లింగ్..
ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి సంరక్షణలో పూర్వం నుంచి వస్తున్న ఓ టెక్నిక్. చాలా మంది దీన్ని ఆచరిస్తున్నారు కూడా. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల చిగుళ్లలో ఉండే రక్త స్రావం, వాపు, నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. కొద్దిగా నూనె తీసుకుని.. దానితో మీ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఈ ప్రక్రియ చేయడం కోసం కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.