AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedy for Filariasis: బోద కాలితో బాధపడుతున్నారా.. ఇంట్లో సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి ఇలా

Home Remedy for Filariasis : మనదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితంనుంచి ఉన్న వైద్యం ఆయుర్వేదం.. ఇందులో చికిత్సగా సహజంగా లభ్యమయ్యే ప్రకృతి ప్రసాదిత వస్తువులనే చికిత్స కోసం ఉపయోగిస్తారు..

Home Remedy for Filariasis: బోద కాలితో బాధపడుతున్నారా.. ఇంట్లో సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందండి ఇలా
Filariasis
Surya Kala
|

Updated on: Jun 27, 2021 | 12:42 PM

Share

Home Remedy for Filariasis : మనదేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితంనుంచి ఉన్న వైద్యం ఆయుర్వేదం.. ఇందులో చికిత్సగా సహజంగా లభ్యమయ్యే ప్రకృతి ప్రసాదిత వస్తువులనే చికిత్స కోసం ఉపయోగిస్తారు.. అయితే కాలక్రమంలో ఆయుర్వేదం స్థానంలో అల్లోపతి అడుగు పెట్టింది. అనారోగ్యాని తగ్గించే గుణం ఇంగిలీషు మందులకు ఉంటుంది అనే నమ్మకం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అల్లోపతిలో నయం కానీ వ్యాధులను కూడా ఆయుర్వేదంలో చికిత్స ఉంది అని నిపుణులు చెబుతున్నారు. అల్లోపతిలో నయం కానీ వ్యాధుల్లో ఒకటి బోద కాలి వ్యాధి. ఇది కొన్ని రకముల దోమకాటు వలన ఎక్కువగా వస్తుంది.ప్రారంభ దశలో జ్వరం వస్తుంది.తర్వాత కాలి యొక్క వాపు కలుగుతుంది. ప్రారంభదశలోనే వ్యాధి తెలుసుకుంటే నయం చేయడం ఈజీనే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. ఆయుర్వేదంలో మహా సుదర్శన చూర్ణం,నిత్యానంద రసం,శీతాన్శురసం,శ్లీపదారి లోహం , పునర్నవ మండూరము, లోహాసవము వంటి మందులు బోదవ్యాధిని అరికడతాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న చిట్కాలతో వ్యాధి బాధనుంచి ఉపశమనం పొందవచ్చు.

*జిల్లేడు మొక్క వేళ్ళు కాని, పత్తి చెట్టు వేళ్ళను కాని శుభ్రం చేసి, గంజితో కలిపి మెత్తంగా నూరి బోద వచ్చిన చోట లేపనం చేస్తుంటే వాపు తగ్గిపోతుంది. * బొప్పాయి ఆకులను నూరి, రసాన్ని పల్చగా బోద వచ్చిన చోట పులిమి, అరగంట తర్వాత కడిగేసుకుంటే వాపు క్రమంగా తగ్గుతుంది. * మునగ చెట్టు బెరడు, ఆవాలు, శొంఠి సమపాళ్ళలో నూరి వాపు మీద రాస్తుంటే తగ్గుముఖం పడుతుంది. * వాపు ఉన్న ప్లే లో రోజూ కాపడం పెడుతూ.. ప్రతిపూటా అల్లపు రసం తాగితే క్రమంగా బోద వాపు తగ్గుతుంది.

Also Read: బావ చెర్రీ బాటలో నడుస్తానంటున్న అల్లువారబ్బాయి.. ప్రయోగాత్మక సినిమాకు సై అంటూ సిగ్నల్