AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Virus Attack: దేశంలో విస్తరిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. హోలీ టైమ్‌లో మరింత పెరిగిపోయే అవకాశం..

హోలీ సమయంలో చర్మం, జుట్టు రక్షించుకోవడం ఎంత ముఖ్యమో? అంటువ్యాధుల నుంచి రక్షించుకోడానికి కూడా చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొంటున్నారు. జ్వరం, దగ్గు రొంపతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వంటి నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటి లక్షణాలతో బాధపడితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

New Virus Attack: దేశంలో విస్తరిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. హోలీ టైమ్‌లో మరింత పెరిగిపోయే అవకాశం..
Holi 2023
Nikhil
|

Updated on: Mar 07, 2023 | 4:00 PM

Share

దేశంలో చాలా ప్రాంతాల్లో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే హోలీ కోసం షాపింగ్ కూడా ప్రారంభమైంది. హోలీ అనేది మీ రోజువారీ ఒత్తిడిని పక్కన పెట్టి ఉత్సాహంగా చేసుకునే పండుగ. అయితే ఈ ఆనందంలో ఓ కొత్త వైరస్ విజృభించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తుననారు. హెచ్2ఎన్2 ఈ మధ్య కాలంలో వేగంగా విస్తరిస్తుంది. హోలీ సమయంలో చర్మం, జుట్టు రక్షించుకోవడం ఎంత ముఖ్యమో? అంటువ్యాధుల నుంచి రక్షించుకోడానికి కూడా చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమని పేర్కొంటున్నారు. జ్వరం, దగ్గు రొంపతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, వంటి నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం వంటి లక్షణాలతో బాధపడితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం చలి నుంచి వెచ్చని ఉష్ణోగ్రతలకు మారుతుంది. దీంతో హెచ్3ఎన్2 వేగంగా వ్యాపిస్తుంది. దీంతో ప్రజలు ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఛాతీ రద్దీ గురించి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులకు ఇలాంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా హోలీని జరుపుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఆస్తమా రోగులు, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవారు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న అనేక మంది వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు ప్రమాదకర రంగులు పీలిస్తే మరింత ప్రమాదమని పల్మనరీ వైద్య నిపుణులు చెబుతున్నారు. 

హోలీ సమయంలో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండడానికి చిన్న శ్వాసకోశ సమస్యలను కూడా పల్మోనాలజిస్ట్‌ను సంప్రదించాలి.  అంతే కాదు హోలీ సమయంలో రంగుల వల్ల చర్మ, జుట్టు సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హోలీ ఆడే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు చెబుతున్నారు. హోలీ ఆడే ముందు శరీరానికి, జుట్టుకు నూనె రాసుకోవాలని సూచిస్తున్నారు. బహిర్గతమైన చర్మంపై మంచి సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం జుట్టు ద్వారా శోషించబడే రంగుల సంఖ్యను తగ్గిస్తుంది. మీ జుట్టును తెరిచి ఉంచడానికి బదులుగా వాటిని కట్టుకోండి

చేతులను కడుక్కోవాలి

సబ్బు, నీటితో లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌తో మీ చేతులను ఎల్లప్పుడూ మరియు విస్తృతంగా శుభ్రం చేసుకోండి.

ఇవి కూడా చదవండి

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు జాగ్రత్తలు అవసరం

మీరు మీ సూక్ష్మక్రిములకు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తుమ్మినప్పుడు దగ్గినప్పుడు టిష్యూ ఉపయోగించాలి. లేకపోతే కనీసం మోచేతిని ఉపయోగించాలి. వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 

ముఖాన్ని తాకకూడదు

మీ ముఖాన్ని ఎక్కువగా తాకకూడదు. ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోటిని తరచూ తాకకుండా ఉండాలి. అలాగే తరచుగా తాకాల్సిన ఉపరితలాలను శుభ్రంగా ఉంచాలి. వాటి నుంచి శరీరంలోకి  వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గుంపునకు దూరం

హోలీ సమయంలో రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారితో తగినంత దూరం పాటించాలి. గర్భిణులు, ఆస్తమా వంటి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి వారు గుంపులకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..