AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి.. శరీరంలో ఇది ఎలా తయారవుతుంది?

ఏదైనా అనారోగ్యం సంభవిస్తే అప్రమత్తం కావాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన..

High Uric Acid: యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి.. శరీరంలో ఇది ఎలా తయారవుతుంది?
High Uric Acid
Subhash Goud
|

Updated on: Apr 15, 2023 | 7:01 PM

Share

ఏదైనా అనారోగ్యం సంభవిస్తే అప్రమత్తం కావాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇప్పుడున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్ని సార్లు మన చేతి వేళ్ళు వాచడం ప్రారంభిస్తుంటాయి. అంటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగిందని అర్థం. సరిగ్గా లేని జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల తలెత్తే వ్యాధులలో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. యూరిక్ యాసిడ్ శరీరంలోని రక్తం ద్వారా కిడ్నీలో కి చేరుతుందని మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ శరీరంనుండి బయటకు వెళ్లలేకపోతే అప్పుడు మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..

యూరిక్ యాసిడ్ రక్తం లో కనిపించే రసాయనం యూరిన్ అనే పదార్థం శరీరంలో విచ్చిన్నం అయినప్పుడు ఇది ఏర్పడుతుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలావరకు రక్తంలో క‌రిగి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. యూరిక్ యాసిడ్ శరీరం నుంచి బయటకు రాలేకపోతే కీళ్లనొప్పులు గౌట్ వ్యాధులు వస్తాయి.

శరీరంలో ఎలా తయారవుతుంది?

యూరిక్ యాసిడ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ వంటి మూలకాలతో రూపొందించబడింది. ఇది ప్రోటీన్ల నుంచి అమైనో ఆమ్లాల రూపంలో శరీరానికి లభిస్తుంది. యూరిక్ యాసిడ్ గా మారి ఎముకల మధ్య పేరుకుపోతుంది. ఎముకలలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల గౌట్ వస్తుంది. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. ఈ సమస్య కారణంగా కీళ్లలో నొప్పి వస్తుంది. అయితే ఇది ప్రారంభంలో ఉండగా యూరిక్ యాసిడ్ పెరుగుదల గుర్తించలేమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

యూరిక్ యాసిడ్ పెరుగుదలను గుర్తించగల కొన్ని లక్షణాలు

  • వేళ్లు ఆవాపు రావడం
  • కీళ్లనొప్పి ఉండటం
  • లేవడంలో ఇబ్బందిగా ఉండటం
  • వేళ్ళలో గుచ్చుకునే నొప్పిగా అనిపించడం

యూరిక్ యాసిడ్ పెంచే 4 ఆహారాలు

  1. పాలకూర, డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ పెరుగు అన్నం పప్పు, పాలకూరలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను పెంచుతాయి.
  2.  పాలు అన్నం: మీరు పెరిగిన యూరిక్ యాసిడ్ లక్షణాలు కనిపించినట్లయితే రాత్రి సమయంలో అంటే పడుకునే ముందు పాలు లేదా అన్నం తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాత్రిపూట వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
  3. ఒలిచిన కాయధాన్యాలు: యూరిక్ యాసిడ్ పెరిగితే మీరు ఒలిచిన కాయధాన్యాల ఉపయోగాన్ని తగ్గించాలి. ఎందుకంటే పొట్టు తీసిన పప్పు యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది.
  4. మాంసం గుడ్డు, చేపలు: శరీరంలో పెరుగుతున్న యూరీక్ యాసిడ్ నియంత్రణకు గుడ్లు మాంసం చేపలు తీసుకోవడం మానేయాలి.

ఇక తాగునీటి విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. యూరిక్ యాసిడ్ నియంత్రించడానికి మీరు నియమాల ప్రకారం నీరు తాగాలి. ఆహారం తీసుకునేటప్పుడు నీటిని తీసుకోవద్దు. ఆహారం తిన్న గంట లేదా గంటన్నర తర్వాత నీరు తాగాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి