AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. ఈ పాలు రోజూ తాగితే అంతే చాలు! షుగర్ ఇట్టే అదుపులోకి వచ్చేస్తుంది..

ఇటీవలి నిర్వహించిన పలు అధ్యయనాలు ఒంటె పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయని నివేదించాయి. ఒంటె పాలలో యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యునోగ్లోబులిన్లు, లాక్టోఫెర్రిన్ పుష్కలంగా ఉన్నట్లు గుర్తించాయి.

షుగర్ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్.. ఈ పాలు రోజూ తాగితే అంతే చాలు! షుగర్ ఇట్టే అదుపులోకి వచ్చేస్తుంది..
Camel Milk
Madhu
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 06, 2023 | 2:19 PM

Share

మనకు ఆవు పాలు.. గేదె పాలు తెలుసు.. అందరూ ఎక్కువగా తీసుకునేది ఇవే. వీటితో అనేకరకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అలాగే ఇటీవల కాలంలో ఒంటె పాలకు కూడా ప్రాచుర్యం పెరుగుతోంది. అదేంటి ఒంటె పాలు కూడా తాగుతారా? అని సందేహిస్తున్నారా? అవునండి ఒంటె పాలలో అనేక ఔషధ గుణాలున్నాయట. ఇది అధిక రక్తపోటు, అధిక షుగర్ లెవెల్స్ ఉన్న వారికి బాగా ఉపకరిస్తాయట. మరి ఒంటె పాలతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి..

పాలు మంచిదే..

మధుమేహులకు పాలు తాగండని వైద్యులు సిఫార్సు చేస్తారు. అయితే తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వులు కలిగిన పాలను ఎంచుకోవడం ఉత్తమం. అయితే ఇటీవలి నిర్వహించిన పలు అధ్యయనాలు ఒంటె పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయని నివేదించాయి. ఒంటె పాలలో యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యునోగ్లోబులిన్లు, లాక్టోఫెర్రిన్ పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడటంతో పాటు ఇతర వ్యాధులను తట్టుకునే రక్షణ కవచంగా కూడా పనిచేస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు.

ఆవు పాలకంటే అధికంగా..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఒంటెలు, ఆవుల నుంచి వచ్చిన పాలల్లో కొవ్వు, ప్రోటీన్, లాక్టోస్, కాల్షియం వంటివి ఇంచుమించు ఒకేరకంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఒంటె పాలలో అధనంగా విటమిన్ సి, అవసరమైన ఖనిజాలు, జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గుణాలు ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే ఒంటె పాలలో కార్బోహైడ్రేట్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. పైగా, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమయ్యే లాక్టోస్ మోతాదు కూడా తక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఇది డయాబెటిక్ రోగులకు మంచిది. ముఖ్యంగా టైప్ 1 అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఒంటె పాలు తీసుకోవడం మేలని అధ్యయనాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

మధుమేహం తగ్గుతుంది..

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒంటె పాలు తీసుకున్న వారిలో మధుమేహం మెరుగైన తగ్గుదలను నమోదు చేసినట్లు గుర్తించడమైనది. అధ్యయనం సమయంలో, మధుమేహం ఉన్న 20 మంది రోగులు 2 నెలల పాటు 500 ml ఒంటె పాలను సేవించారు. ఈ ఒంటె పాలు వారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంతో పాటు, గ్లైసెమిక్ నియంత్రణకు కూడా దోహదపడినట్లు అధ్యయన ఫలితాలను వెల్లడించారు.

పుష్కలంగా ఇన్సులిన్..

ఒంటె పాలలో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి దాని యాంటీడయాబెటిక్ చర్యను పెంచడంలో సహాయపడతాయి. ఒంటె పాలు 4 కప్పులకు 52 యూనిట్ల ఇన్సులిన్‌కు సమానమైనవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒంటె పాలలోని ఇన్సులిన్ నానోపార్టికల్స్ రూపంలో కుదించబడుతుంది. ఇది హార్మోన్లను సరైన రూపంలో రక్తప్రవాహంలోకి ప్రవహిస్తుంది. ఇంకా, ఇన్సులిన్ గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒంటె పాలను పచ్చిగా తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ పాలను మరిగించడం వల్ల ఈ పాలలోని ఔషధ గుణాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒంటె పాలను పాశ్చరైజేషన్ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ రోజూ రెండు కప్పులు లేదా 500 ఎంఎల్ పచ్చి ఒంటె పచ్చి పాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని చెబుతున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. వినియోగించే ముందు ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..