Leukemia In Children: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించాయా? వెంటనే అప్రమత్తం అవ్వండి? అది బ్లడ్ క్యాన్సర్ కావచ్చు!
దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స చేయించుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ల్యూకేమియా లక్షణాలు ఎలా ఉంటాయి? అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ల్యూకేమియా అనేది ఓ క్యాన్సర్. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య అధిక సంఖ్యలో ఉత్పత్తి కావడం వల్ల ల్యూకేమియా వస్తుంది. ఎందుకంటే తెల్ల రక్త కణాలు ఉండాల్సిన సంఖ్య కంటే అధిక సంఖ్యలో ఉంటే అవి ఎర్ర రక్త కణాలను, ప్లేట్‌లేట్స్ ఉత్పత్తి తగ్గిస్తాయి. మన శరీరానికి అవసరమైనన్ని ఎర్రరక్తకణాలను ఉత్పత్తి జరగకుండా వాటిని బలహీన పరుస్తాయి. అవి బలహీన పడటం వల్ల ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి తగ్గి రక్తకణజాలల్లో కణుతులు ఏర్పడటమే కాకుండా ఎముక మజ్జలో కూడా కణుతులు ఏర్పడతాయి. ఇవే లుకేమియాకు దారిస్తాయి. దీనివల్ల శరీరంలో శక్తి సామర్థ్యం తగ్గి రోజుకు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే దీనిని ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స చేయించుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ల్యూకేమియా లక్షణాలు ఎలా ఉంటాయి? అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎలా గుర్తించాలి.. పిల్లల్లో అసాధారణ లక్షణాలు ఏమి ఉండవు. కానీ సాధారణంగా కనిపించే జ్వరం, జలుబు, దగ్గు వంటివి కనిపిస్తాయి. అయితే అవి రెండు వారాలకన్నా ఎక్కువగా ఉంటే మాత్రం అప్రమత్తం అవ్వాలి.
ప్రధాన లక్షణాలు..
- పిల్లలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తున్నా.. లేక ఆడుతూ ఆకస్మాత్తుగా నీరసించిపోయినా వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.
- పిల్లలకి తరచుగా అయ్యే గాయాలు త్వరగా మానకపోయినా.. రక్త స్రావం అధికంగా అవుతూ ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యుడికి చూపించాలి.
- ఇన్ఫెక్షన్, జ్వరం అనేది పిల్లలు పెద్దలలో అన్ని రకాల క్యాన్సర్ల సాధారణ లక్షణం. పిల్లలకి నిరంతర జ్వరం ఉంటే, జ్వరం చాలా కాలం పాటు తగ్గకపోతే, వెంటనే టెస్టులు చేయించాల్సి ఉంటుంది.
- తరచుగా లేదా నిరంతర దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటే జాగ్రత్త పడాలి.
- అలాగే చిగుళ్ల సమస్యలు, శరీరంపై దద్దుర్లు, వేగంగా బరువు తగ్గడం, శరీరంలోని ఏదైనా భాగంలో వాపు, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, తలనొప్పి, ఎక్కువగా వాంతులు అవుతుంటే జాగ్రత్త పడాలి.
చికిత్స ఇలా..
ల్యూకేమియాకు చికిత్స అది సోకిన వ్యక్తిని బట్టి ఉంటుంది. పిల్లల వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలు, ఇతర అవయవాల పనితీరు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, రేడియేషన్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటివి అంకాలజిస్ట్ లు ల్యూకేమియాకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







