హెపటైటిస్ అంటే ఏంటి..ఇది ఎన్ని రకాలు.. ట్రీట్‌మెంట్ ఏంటో తప్పక తెలుసుకోండి..!
గర్భిణి హెపటైటిస్ పాజిటివ్ అయితే, పుట్టిన బిడ్డకు 24 గంటల్లో హెపటైటిస్-బి ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇవ్వాలి. సూదులతో పచ్చబొట్టు ప్రమాదకరం. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. కామెర్లు వస్తే విపరీతమైన పత్యాలు చేస్తారు. గంజి, జావ ఇస్తారు. ఇవి బలవర్ధకమైనవి కావు. కామెర్లతో బాధపడుతున్నపుడు సాధారణ ఆహారమే పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

హెపటైటిస్ అంటే ఏమిటి..? ఇది కాలేయానికి సంబంధించి ఒక వ్యాధి. ఇది సాధారణంగా వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా లేదా కొన్ని మందులు మొదలైన వాటి వలన ఇది కలుగుతుంది. ఒక వేళ అది వైరస్స్ వలన వస్తే దానిని వైరల్ హెపటైటీస్‌గా పిలుస్తారని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ హెపటైటిస్‌లో ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకు 5 రకాల వైరస్‌లున్నాయి. హెపటైటిస్-ఎ, ఇ కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకుతాయి. హెపటైటిస్-బి ద్వారా కాలేయం దెబ్బతిని, దాని పనితీరు మందగిస్తుంది. క్రమేపీ అది లివర్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. చివరి దశలో రక్తపు వాంతులు కావొచ్చు. హెపటైటిస్-బి, సి వైరస్ రక్తం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. లాలాజలం, వీర్యం, యోని స్రావాలతోనూ సంక్రమిస్తుంది. హెపటైటిస్-డిలోనూ బి లక్షణాలే కన్పిస్తాయి.
రక్త మార్పిడి సమయంలో హెపటైటిస్ వైరస్ సోకే అవకాశం ఉంది. ఇది ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినపుడు కూడా సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భిణి నుంచి బిడ్డకు, అలాగే, లైంగిక సంపర్కం ద్వారా బీ వైరస్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే లివర్ క్యాన్సర్‌గా, సిర్రోసిస్‌గా మారుతుంది. హెపటైటిస్ లాగే సీ కూడా ప్రమాదకరమైందే. బీ వైరస్ ను టీకాతో నివారించవచ్చు. కానీ సీ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెపటైటిస్-ఎ, ఇ బాధితుల్లో హెపటైటిస్-బి, సి మాదిరిగా లక్షణాలు బయటకు కనిపించడం లేదు. ఇతర జబ్బులకు వైద్య పరీక్షలు చేసినప్పుడు మాత్రమే ఈ కేసులు బయటపడుతున్నాయి. పుట్టిన బిడ్డకు టీకాల కార్యక్రమంలో భాగంగా హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇవ్వాలి. గర్భిణి హెపటైటిస్ పాజిటివ్ అయితే, పుట్టిన బిడ్డకు 24 గంటల్లో హెపటైటిస్-బి ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇవ్వాలి. సూదులతో పచ్చబొట్టు ప్రమాదకరం. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. కామెర్లు వస్తే విపరీతమైన పత్యాలు చేస్తారు. గంజి, జావ ఇస్తారు. ఇవి బలవర్ధకమైనవి కావు. కామెర్లతో బాధపడుతున్నపుడు సాధారణ ఆహారమే పెట్టాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








