Backache: మీకు వెన్నునొప్పి బాధిస్తుందా..? ఉపశమనం కోసం ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి

Backache: చాలా మంది బిజీ లైఫ్‌, ల్యాప్‌టాప్‌లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఆరోగ్యం (Health)పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అలాంటివారు గంటల తరబడి పనిచేయాలనే..

Backache: మీకు వెన్నునొప్పి బాధిస్తుందా..? ఉపశమనం కోసం ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి
Backache
Follow us
Subhash Goud

|

Updated on: Mar 26, 2022 | 9:15 PM

Backache: చాలా మంది బిజీ లైఫ్‌, ల్యాప్‌టాప్‌లో గంటల తరబడి పనిచేయడం వల్ల ఆరోగ్యం (Health)పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అలాంటివారు గంటల తరబడి పనిచేయాలనే తపనతో మంచి డైట్‌ని పాటించరు. శారీరకంగా కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. అటువంటి పరిస్థితిలో ప్రజలు వెన్నునొప్పి (Backache) లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. నడుము నొప్పి అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు ఈ సమస్య చాలా సందర్భాలలో వృద్ధులను వేధించేది. అయితే నడుము ఎముకతో పాటు కండరాలు, నరాలు, డిస్క్‌లు కూడా ఇందుకు కారణం కావచ్చని తెలుసుకోవాలి. ఈ నొప్పి నడుము నుండి మాత్రమే కాకుండా శరీరంలోని ఇతర భాగాల నుండి కూడా రావచ్చు. దీని నుంచి ఉపశమనం పొందాలంటే డాక్టర్ లేదా స్పెషలిస్ట్ సలహా మేరకు మెడిసిన్ తీసుకోవచ్చు. అయితే కొన్ని హోం రెమెడీస్ పాటించడం ద్వారా వెన్నునొప్పిని కూడా దూరం చేసుకోవచ్చు. ఈ నివారణల గురించి తెలుసుకోండి.

  1. పసుపు పాలు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు చాలా ఉన్నాయి. ఇవి శరీరంలో తలెత్తే సమస్యను చాలా వరకు అధిగమించగలవు. పురాతన కాలం నుంచి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలలో ఇది సహాయకరంగా ఉంటుందని నిరూపించబడింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడానికి మీరు పసుపు పాలు తాగవచ్చు. దీనితో వెన్నునొప్పి తగ్గిపోతుంది. అలాగే జలుబు, దగ్గు కూడా తగ్గిపోతుంది.
  2. కొబ్బరి నూనే: ఇందులో చాలా గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను దూరం చేయడమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కొబ్బరి నూనె కూడా ఎప్పటి నుంచో ఆరోగ్యకరమైన పదార్ధంగా ప్రజల దినచర్యలో భాగంగా మారింది. మీకు తరచుగా వెన్నునొప్పి ఉంటే దాని నుండి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చగా మర్దన చేసుకోవాలి.
  3. ఆవనూనె: ఈ నూనెను పాత కాలం నుంచి చాలా మంది ఉపయోగిస్తుంటారు. దీనిని నేటికీ చాలా మంది ప్రజలు అనుసరిస్తున్నారు. మస్టర్డ్ ఆయిల్‌లో కూడా ఇటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఒక గిన్నెలో ఆవాల నూనె తీసుకుని వేడి చేయండి. ఈ నూనెలో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి ఉడికించాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేయండి. ఈ విధానం నుంచి మీరు చాలా ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి:

Temperature: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హీట్‌స్ట్రోక్‌తో ప్రమాదం.. నిపుణుల సలహాలు, సూచనలు

Gourd juice: సొరకాయ రసం ఆరోగ్యానికి ఒక వరం.. అదిరిపోయే ప్రయోజనాలు