Weight Loss: అధికంగా ఉన్న బరువు తగ్గాలంటే సరైన పద్ధతుల్లో ఈ ఐదు పాటిస్తే చాలంట..అవి ఏమిటంటే..
Weight Loss: అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
Weight Loss: అధిక బరువు ఉండటం గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, బరువును నియంత్రించడం చాలా ముఖ్యమైన విషయం. బరువు తగ్గించుకోవడం అనేది పెద్ద కష్టమైన పనిగా భావిస్తారు అందరూ. కానీ, సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే బరువు తగ్గించుకోవడం.. అదీ వేగంగా సాధ్యమే అంటున్నారు పరిశోధకులు. బరువు తగ్గడం కోసం పరిశోధకులు చెబుతున్న ఐదు మార్గాలు సక్రమంగా అనుసరిస్తే నెల రోజుల్లో మూడు కిలోల బరువు తగ్గొచ్చు అని చెబుతున్నారు. దీనిని యుఎస్ హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కూడా ధృవీకరించింది. మరి ఆ విధంగా బరువు తగ్గడానికి సహాయపడే 5 మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అల్పాహారం కోసం అధిక ప్రోటీన్ తినండి..
కార్బోహైడ్రేట్ల కన్నా ప్రోటీన్ జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ కేలరీలు ఖర్చు చేయాల్సి ఉంటుందని యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ లో ప్రచురించిన పరిశోధనలో పేర్కొన్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం, రోజంతా వినియోగించే మొత్తం కేలరీలలో ప్రోటీన్ మొత్తాన్ని 25 శాతం పెంచుకుంటే, ఆకలి కోరిక 60 శాతం తగ్గుతుంది, ఇది కేలరీలను తీసుకోవడం తగ్గిస్తుంది.
2. బరువును తగ్గించే ఆహారం తీసుకోవడం..
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పప్పుధాన్యాలు, బీన్స్ ప్రోటీన్ ఫైబర్ కు సంబంధించిన మంచి వనరులు. ఇవి కేలరీలు తీసుకోవడం తగ్గిస్తాయి. అధిక ఫైబర్, తక్కువ కేలరీలు ఆకు కూరలలో కనిపిస్తాయి. ఇది ఆకలి అనుభూతిని తగ్గిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రోటీన్‌తో పాటు గింజల్లో కూడా అనేక రకాల పోషకాలు కనిపిస్తాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.
3. మంచి నిద్ర పొందండి..
తక్కువ నిద్ర ఆకలిని తగ్గించే హార్మోన్‌ను తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు, ఆకలిని తగ్గించే లెప్టిన్ అనే హార్మోన్ స్రావం తగ్గుతుంది. అదే సమయంలో, ఆహారం-జీర్ణమయ్యే హార్మోన్ గ్రెలిన్ పెరుగుతుంది. కొలరాడో విశ్వవిద్యాలయం ప్రకారం, ఒక వ్యక్తికి వారానికి 5 గంటల నిద్ర మాత్రమే ఉంటే కనుక, అతని బరువు ఒక కిలో పెరుగుతుంది.
4. నెమ్మదిగా తినండి..
హెల్త్ మ్యాగజైన్ హెల్త్ లైన్ ప్రకారం, ఆహారం-జీర్ణమయ్యే హార్మోన్ గ్రెలిన్, ఆకలిని నియంత్రించే హార్మోన్ల నుండి సంకేతాలు మెదడుకు చేరడానికి 20 నిమిషాలు పడుతుంది. అటువంటి పరిస్థితిలో, వేగంగా తినడం ద్వారా, సిగ్నల్ మెదడుకు చేరే వరకు మీరు ఎక్కువ కేలరీలను తీసుకుంటారు.
5. చక్కెర పానీయాలు-పండ్ల రసాలకు దూరంగా ఉండండి..
చక్కర పానీయాలను తీసుకోవడం రెండు కిలోల వరకు బరువు పెరగడానికి దారితీస్తుంది. హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, చక్కెర పానీయాలు, తియ్యటి పండ్ల రసాలు బరువు నియంత్రణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ప్రతిరోజూ ఒక పానీయం సోడా, కోలా, ఫ్రూట్ పంచ్, ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే, ఇతర ఆహారం నుండి కేలరీలను తగ్గించే బదులు, సంవత్సరంలో సుమారు 2 కిలోల బరువు పెరుగుతుంది.
Also Read: Alcohol: మద్యం తాగిన వారు ఆ వ్యాధి బారిన పడే రిస్క్ ఎక్కువ..పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే!