Weight Gain Foods: సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఈ ఫుడ్ తినాల్సిందే
శరీరం సన్నగా ఉండి బలహీనంగా కనిపించే వారు బరువు పెరగడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ తినే ఆహారం సరైనదిగా లేకపోతే ప్రయోజనం ఉండదు. బలంగా, ఆరోగ్యంగా బరువు పెరగాలంటే శక్తినిచ్చే పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. అలాంటి ఆరోగ్యకరమైన హై కేలరీ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ లలో సహజ ఫ్యాట్ లు, ప్రోటీన్లు, శక్తినిచ్చే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రోజూ గుప్పెడు గింజలు తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇవి స్నాక్స్ లా తీసుకోవచ్చు లేక స్మూతీల్లో కలిపినా మంచిదే. పౌష్టికాహారం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
ఆవకాడో పండు సహజంగా కొవ్వులు ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్, విటమిన్ లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ పండును సలాడ్, శాండ్విచ్, స్మూతీలో కలిపి తీసుకుంటే శరీరానికి తగిన శక్తి అందుతుంది. ఇది బరువు పెరగాలనుకునే వారికి సహాయపడుతుంది.
చీజ్ శక్తివంతమైన ఆహారం. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా లభిస్తాయి. చీజ్‌ను సలాడ్, పాస్తా, శాండ్విచ్ వంటి వంటకాలతో కలిపి తినడం ద్వారా శక్తి పెరుగుతుంది. ఇది రుచి కూడా ఇస్తుంది.
ఆల్మండ్ లేదా పీనట్ బటర్ లలో సహజంగా ప్రోటీన్, ఫ్యాట్‌లు అధికంగా ఉంటాయి. బ్రెడ్ టోస్ట్ మీద వేయడం, లేక ఫ్రూట్ స్మూతీల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇది శక్తిని అందిస్తుంది. తక్కువ మోతాదులో కూడా ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం ఇది.
పండ్లు, పాలు, గింజలు, యోగర్ట్, ప్రోటీన్ పౌడర్, నట్ బటర్ వంటి పదార్థాలతో తయారయ్యే స్మూతీలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇవి ఉదయాన్నే లేదా వర్కౌట్ తర్వాత తీసుకుంటే మంచిది. అధిక కేలరీలు కావాల్సిన వారికి ఇది మంచి ఎంపిక.
వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అన్నం కూరలతో లేదా పాలకూరలతో కలిపి తింటే శక్తి, పోషణ రెండూ లభిస్తాయి. బరువు పెరగాలనుకునే వారు రోజూ అన్నాన్ని తప్పక తినాలి.
పాలు ప్రోటీన్, ఫ్యాట్‌లు, కార్బ్స్ సమతుల్యంగా కలిగి ఉండటంతో శరీరానికి పూర్తి శక్తిని అందిస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల పాలును తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. కండరాల బలానికి కూడా ఇది తోడ్పడుతుంది.
కోకో అధికంగా ఉండే డార్క్ చాక్లెట్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాట్‌లు అందించడంలో కీలకంగా ఉంటుంది. మితంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇది రుచికరమైనది కావడంతో పాటు బరువు పెరగడంలో సహాయపడుతుంది.
బంగాళదుంపలలో స్టార్చ్ అధికంగా ఉండటం వల్ల శక్తి త్వరగా అందుతుంది. ఉడికించి, వేయించి లేదా రోస్ట్ చేసి తింటే పోషకాలు తగ్గకుండా శక్తిని అందిస్తుంది. వీటిని కూరగాయలతో కలిపి వండితే బలంగా ఉండే శక్తివంతమైన ఆహారంగా మారుతుంది.
ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారు రోజువారీ ఆహారంలో పై పదార్థాలను చేర్చితే మంచిది. ఇవి సహజంగా శక్తిని అందించడమే కాకుండా శరీరాన్ని బలంగా కూడా మారుస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)