AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఒక వారం రోజులపాటు పళ్లు తోమకపోతే ఏమవుతుందో తెలుసా? ఇదిగో ఇక్కడ తెలుసుకోండి..

Mouth Health: ఒక వారం పాటు బ్రష్ చేయకపోతే ఏమి జరుగుతుంది? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ లోచనే అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే.. ఒక్క రోజు పళ్లు తోమకపోతేనే ఏదోరకంగా ఉంటుంది నోరంతా. పళ్ళు మనకు విలువైనవి, అవి లేకపోతే మనం ఏ పదార్థాన్ని కూడా తినలేము. ఆ ఆహారాన్ని ఆస్వాదించలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తారు. చాలా మంది దంతవైద్యులు రోజుకు రెండుసార్లు పళ్ళు..

Health Tips: ఒక వారం రోజులపాటు పళ్లు తోమకపోతే ఏమవుతుందో తెలుసా? ఇదిగో ఇక్కడ తెలుసుకోండి..
Mouth Brush
Shiva Prajapati
| Edited By: |

Updated on: Sep 24, 2023 | 7:15 PM

Share

Mouth Health: ఒక వారం పాటు బ్రష్ చేయకపోతే ఏమి జరుగుతుంది? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ లోచనే అసహ్యంగా ఉంటుంది. ఎందుకంటే.. ఒక్క రోజు పళ్లు తోమకపోతేనే ఏదోరకంగా ఉంటుంది నోరంతా. పళ్ళు మనకు విలువైనవి, అవి లేకపోతే మనం ఏ పదార్థాన్ని కూడా తినలేము. ఆ ఆహారాన్ని ఆస్వాదించలేదు. అందుకే నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తారు. చాలా మంది దంతవైద్యులు రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలని సిఫార్సు చేస్తారు. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేయాలని చెబుతారు. కానీ, ఒక వ్యక్తి ఒక వారం పాటు బ్రష్ చేయకపోతే? అది వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? నోటి ఆరోగ్యానికి సంబంధించి తప్పక తెలుసుకోవాల్సిన ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..

ఒక వారం పాటు బ్రష్ చేయకపోతే జరిగే పరిణామాలివే..

1. నోటి ఆరోగ్యంపై ప్రభావం:

ఒక వారం పాటు బ్రష్ చేయకపోవడం చాలా ప్రమాదకరమైన పరిణామాలను కలిగిస్తుంది. దీని కారణంగా నోరు చెడిపోతుంది. అనేక రకాల నోటి సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

2. దంత క్షయం:

దంతాలను బ్రష్ చేయకపోవడం వల్ల, క్షయం కలిగించే బ్యాక్టీరియా మీ నోటిలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా దంతాల కావిటీస్ పెరగడం ప్రారంభమవుతుంది. దంతాలను కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే.. రోజూ కచ్చితంగా బ్రష్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

3. పంటి నొప్పి:

బ్రష్ చేయడం వల్ల మన నోటిలో అనేక రకాల క్రిములు పెరుగుతాయి. ఇవి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం మన నోటిలో ఉంటే, అవి పంటి నొప్పికి కారణమవుతాయి.

4. చిగుళ్లలో సమస్యలు:

వారం రోజుల పాటు బ్రష్ చేయకపోవడం వల్ల మన చిగుళ్లపై కూడా ప్రభావం చూపుతుంది.అలా చేయడం వల్ల చిగుళ్లలో నొప్పి, మంట, చిగుళ్లలో రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి.

5. నోటి దుర్వాసన:

చాలా రోజులుగా పళ్ళు తోమకపోవటం వల్ల నోటి దుర్వాసన రావడం మొదలవుతుంది. దీని వలన మీరు నలుగురి మధ్యకు వెళ్లలేక మీ సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏదైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..