AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మతిమరుపు సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి..

Health Tips: డిమెన్షియా అనేది పెద్దవారిలో సాధారణ ఆరోగ్య పరిస్థితి. దీని వల్ల మెదడు కుంచించుకుపోవడం, కణాలు చనిపోవడం మొదలవుతుంది.

Health Tips: మతిమరుపు సమస్యతో సతమతం అవుతున్నారా? ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టండి..
Brain Health
Shiva Prajapati
|

Updated on: Jul 07, 2022 | 6:15 AM

Share

Health Tips: డిమెన్షియా అనేది పెద్దవారిలో సాధారణ ఆరోగ్య పరిస్థితి. దీని వల్ల మెదడు కుంచించుకుపోవడం, కణాలు చనిపోవడం మొదలవుతుంది. ఈ సమస్యతో బాధపడేవారి ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి బలహీనపడటం మొదలవుతుంది. మెదడు కార్యకలాపాలు తగ్గిపోవడంతో ప్రవర్తనలో మార్పు వస్తుంది. మతిమరుపు ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం అయినప్పటికీ, ఇది అనేక శరీర విధులను బలహీనపరుస్తుంది. ఒక వ్యక్తి దినచర్యపై ప్రధానంగా ప్రభావాన్ని చూపుతుంది.

వ్యక్తిలో చిత్తవైకల్యానికి కారణమేమిటో స్పష్టంగా తెలియకపోయినా.. జీవనశైలి, పర్యావరణం నిస్సందేహంగా పాత్ర పోషిస్తాయని వైద్యులు అంటున్నారు. మనం తినే ఆహారం కూడా మన మెదడును ప్రభావితం చేస్తుందని, అది సక్రమంగా పనిచేయడానికి సహకరిస్తుందని చెబుతున్నారు. మరి డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడానికి ఏడు రకాల ఆహార పదార్థాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుపచ్చ కూరగాయలు: ప్రధానంగా బ్రోకలీ, కాలీఫ్లవర్, బచ్చలికూర, క్యాబేజీ మొదలైన వాటితో సహా ఆకుపచ్చ కూరగాయలు క్రూసిఫరస్ కూరగాయల సమూహానికి చెందినవి. ఇవి శరీరానికి, మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరమైన వివిధ పోషకాలను కలిగి ఉన్నందున వాటిని సూపర్‌ఫుడ్‌లుగా పేర్కొంటారు.

బాదం: బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు. ఇవి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

చేప: చేపలలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఒక వ్యక్తిలో ఉల్లాసమైన మానసిక స్థితిని సృష్టిస్తాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే కణాల నష్టాన్ని కూడా తగ్గిస్తాయి.

చికెన్: చికెన్‌లో ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ B6, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

కెఫిన్ పానీయాలు: కాఫీ, టీ వంటి కెఫిన్ డ్రింక్స్ శక్తిని పెంచే డ్రింక్స్‌గా పరిగణించబడతాయి. ఇవి స్టామినాను పెంచడమే కాకుండా మూడ్ బూస్టర్లుగా కూడా పనిచేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున వాటిని సూపర్‌ఫుడ్‌లుగా కూడా పరిగణిస్తారు. డార్క్ చాక్లెట్లు మొత్తం ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అవి చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి సంబంధిత ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి.

దాల్చిన చెక్క: దాల్చిన చెక్క వంటల్లో సువాసన కోసం ఉపయోగించే మసాలా. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల మెదడులో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..