Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాన్ని తింటున్నారా? ప్రమాదమే!
కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యకరమే అయినప్పటికీ, ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోయినా చిరాకు వంటి సమస్యలు రావచ్చు. మనం తినే ఆహారం కూడా కొన్నిసార్లు మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కానీ అల్పాహారం కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహారాలు తినకుండా..
కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యకరమే అయినప్పటికీ, ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోయినా చిరాకు వంటి సమస్యలు రావచ్చు. మనం తినే ఆహారం కూడా కొన్నిసార్లు మన శరీరంపై ప్రభావం చూపుతుంది. కానీ అల్పాహారం కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహారాలు తినకుండా ఉండటం మంచిదంటున్నారు.
- పండ్ల రసాలు, స్మూతీస్: పండ్ల రసాలు, స్మూతీలలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అల్పాహారంగా వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా, తక్కువ ఫైబర్ కంటెంట్ కారణంగా ఆకలి అనుభూతి తగ్గుతుంది.
- అరటిపండు: ఇందులో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు హృదయ స్పందన రేటులో మార్పులు ఉండవచ్చు.
- ఆయిల్ ఫుడ్స్: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాంతులు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, కడుపులో అల్సర్ వంటి సమస్యలు వస్తాయి.
- పుల్లని ఆహారాలు: ఖాళీ కడుపుతో పుల్లని ఆహారం తీసుకోవడం వల్ల గొంతులో అసౌకర్యం కలుగుతుంది. పుల్లని ఆహారాలు కడుపులో ఒక రకమైన చెడు బ్యాక్టీరియాను సృష్టిస్తాయి. ఇవి వాంతులు, మూర్ఛలు మొదలైన వాటికి కారణమవుతాయి. పుల్లని రుచి కలిగిన పండ్ల అయినప్పటికీ వాటికి దూరంగా ఉండటం మంచిది.
- స్వీట్లు: చాలా మంది ప్రజలు ఎప్పుడైనా స్వీట్లు తినడానికి ఇష్టపడుతుంటారు. స్వీట్లపై మోజు అలాంటిది. పిల్లలు ముఖ్యంగా స్వీట్లను ఇష్టపడతారు. ఉదయాన్నే పరగడుపున తింటే ఛాతీలో ఒక రకమైన పులుపు వస్తుంది.
- మాంసం వంటకాలు: నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడదు. మాంసాహారం సులభంగా జీర్ణం కాదు.
- బేరి: బేరిపండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపు నొప్పి, శ్లేష్మ పొర దెబ్బతింటుంది.
- ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి హాని కలిగించే అనేక ఆహారాలు ఉన్నాయి. అందువల్ల, అల్పాహారం ఎల్లప్పుడూ ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఆకలి బాధలు తగ్గుతాయి. బరువును గణనీయంగా తగ్గిస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి