Health Tips: పడుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. వెన్ను సమస్యలు వస్తాయి!
మనం ఆరోగ్యంగా ఉండి ఏ పని చేయాలన్నా.. వెన్ను ముక హెల్దీగా ఉండాలి. వెన్నుముక హెల్దీగా లేకపోతే ఏ పనీ చేయలేరు. ప్రస్తుతం ఇప్పుడు గంటల తరబడి కంప్యూటర్లు, లాప్ టాప్స్ ముందు కూర్చోవడం వల్ల కూడా వెన్ను సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మనం పడుకునే అలవాట్ల కారణంగా కూడా వెన్ను సమస్యలు వస్తాయన్న విషయం మీకు తెలుసా.. మనం పడుకునే అలవాట్లు మార్చోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా మన లైఫ్ స్టైల్లో కొన్ని..

మనం ఆరోగ్యంగా ఉండి ఏ పని చేయాలన్నా.. వెన్ను ముక హెల్దీగా ఉండాలి. వెన్నుముక హెల్దీగా లేకపోతే ఏ పనీ చేయలేరు. ప్రస్తుతం ఇప్పుడు గంటల తరబడి కంప్యూటర్లు, లాప్ టాప్స్ ముందు కూర్చోవడం వల్ల కూడా వెన్ను సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మనం పడుకునే అలవాట్ల కారణంగా కూడా వెన్ను సమస్యలు వస్తాయన్న విషయం మీకు తెలుసా.. మనం పడుకునే అలవాట్లు మార్చోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడా వెన్నుముకను ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ అవుతాయి. మరి అవేంటో ఒక్కసారి చూసెద్దాం.
సరైన వ్యాయామం:
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల కూడా వెన్నుముక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వాకింగ్, స్మిమ్మింగ్, వెన్నుముకకు సంబంధించిన ఎక్సర్ సైజులు చేయడం వల్ల చాలా మంచిది. ఇవి కండరాలను బలోపేతం చేయడంలో బాగా హెల్ప్ అవుతాయి.
సరైన విధంగా పడుకోవాలి:
కొంత మంది ఎలా పడితే అలా పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల కండరాలు, పిక్కలు పట్టేయడం గమనించే ఉంటారు. ఉదయం లేచే సరికి ఒళ్లు నొప్పులు, నడుం నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. అంతే విధంగా మీరు నిద్రించడానికి సరైన బెడ్ కూడా ఉండాలి. వెన్ను సమస్యతో ఎక్కువగా బాధ పడేవారు మంచి పరుపును వాడటం వల్ల ఈ సమస్యలు దూరం అవుతాయి. అలాగే వెల్లకిలా పడుకోకూడదు. నిద్రలో అటూ ఇటూ మార్చుకుని పడుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
కాళ్ల మధ్య దిండును ఉంచండి:
మీరు వెన్నుముక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే.. కాళ్ల మధ్య దిండును పెట్టుకుని నిద్ర పోవడం మంచిది. కేవలం గర్భిణులే కాకుండా.. వెన్ను సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా కాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం వల్ల వెన్నుముకపై ఒత్తిడి తగ్గుతుంది.
రిలాక్స్ గా నిద్ర పోవాలి:
సరైన నిద్ర లేని వల్ల కూడా ఈ సమస్యలను ఎదుర్కొనవచ్చు. కాబట్టి మీ శరీరానికి కావాల్సినంత రెస్ట్ ని ఇవ్వండి. 7 లేదా 9 గంటల నిద్ర చాలా అవసరం. రిలాక్స్ గా నిద్ర పోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా లభిస్తుంది.
పని చేసేటప్పుడు నిటారుగా కూర్చోండి:
కూర్చొని పని చేసే ప్రతి వారూ ఈ నడుం నొప్పి, వెన్నుముక సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. కాబట్టి కూర్చొని పని చేసే వారు ఎప్పుడూ నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చొవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.