Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలా.. అయితే లాకర్ డ్రాయర్ లో ఇవి పెట్టండి!

డబ్బు లేనిదే చిల్లి గవ్వనైనా కొనలేం. మన జీవింతంలో ప్రతీది ఇప్పుడు డబ్బుతోనే ముడి పడి ఉంది. డబ్బు లేకపోతే జీవతం లేదు అన్నట్టుగా తయారైంది. కష్ట పడి తెచ్చిన డబ్బు ఏ మాత్రం ఉండకుండా.. వెంటనే ఖర్చు అయిపోతుంటే.. చాలా బాధను కలిగిస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత కూడా నిలబడదు. అయితే కొన్ని రకాల వాస్తు దోషాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురైతాయన్న విషయాన్ని ఎవరూ గమనించారు. డబ్బు పెట్టే డ్రాయర్ వద్ద కొన్ని రకాల వస్తువులు ఉంచడం..

Vastu Tips: ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలా.. అయితే లాకర్ డ్రాయర్ లో ఇవి పెట్టండి!
Money
Follow us
Chinni Enni

|

Updated on: Oct 17, 2023 | 5:54 PM

డబ్బు లేనిదే చిల్లి గవ్వనైనా కొనలేం. మన జీవింతంలో ప్రతీది ఇప్పుడు డబ్బుతోనే ముడి పడి ఉంది. డబ్బు లేకపోతే జీవతం లేదు అన్నట్టుగా తయారైంది. కష్ట పడి తెచ్చిన డబ్బు ఏ మాత్రం ఉండకుండా.. వెంటనే ఖర్చు అయిపోతుంటే.. చాలా బాధను కలిగిస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత కూడా నిలబడదు. అయితే కొన్ని రకాల వాస్తు దోషాల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురైతాయన్న విషయాన్ని ఎవరూ గమనించారు. డబ్బు పెట్టే డ్రాయర్ వద్ద కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల ఇలాంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాత్రూమ్ డోర్:

గతంలో అయితే బాత్రూమ్స్ ఇంటి బయట, ఇంటికి దూరంగా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా మంది బెడ్ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ను పెట్టుకుంటున్నారు. ఇలా బెడ్ రూమ్ లో బాత్రూమ్ ఉంటే వాటి డోర్స్ ఎప్పుడూ మూసి ఉంచాలి. లేక పోతే ధన నష్టం కలుగుతుంది. ఇంట్లో డబ్బు నిల్వ ఉండాంటే.. బాత్రూమ్ డోర్స్ అనేవి ఎప్పుడూ మూసి ఉంచాలి.

ఇవి కూడా చదవండి

చీపురు చాలా దూరంగా పెట్టాలి:

చీపురు లక్ష్మీ దేవి స్వరూపం అయినా.. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. చీపురును ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బును నిల్వ చేసే ప్లేస్ పెట్టకండి. అలాగే బీరువాకి కూడా దూరంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు లోటు ఉండదు.

నలుపు రంగు వస్తువులు పెట్టకండి:

మీరు డబ్బును నిల్వ చేసే లాకర్ లేదా డ్రాయర్ లో నలుపు రంగు వస్తువులు అస్సలు ఉంచకండి. నలుపు రంగు వస్తువులు ఉంచడం వల్ల డ్బబు నిల్వ ఉండదు. అవసరమైతే ఎరుపు రంగును ఉంచడం మంచిది.

వేరే వస్తువులను ఉంచకూడదు:

నగదును నిల్వ చేసే డ్రాయర్ లో బంగారం, వెండి వస్తువులు తప్ప ఇతర వస్తువులు నిల్వ చేయకండి. దీని వల్ల ఎక్కువగా ఖర్చులు వస్తాయి. కాబట్టి డ్రాయర్ లో నగదు, బంగారం, వెండి వస్తువులు మాత్రమే ఉండేలా చూసుకోండి.

చిన్న అద్దం ఉంచండి:

మీ ఇంట్లో డబ్బుకు నిల్వ లేకుండా డబ్బు పేరుకుపోవాలంటే.. మీరు నగదు నిల్వ చేసే డ్రాయర్ లేదా లాకర్ లో చిన్న అద్దాన్ని ఉంచండి. అద్దంలో డబ్బు కనిపించేలా చూడండి. ఇలా చేయడం వల్ల డబ్బు నిల్వ అనేది పెరుగుతుంది.

కుబేరుని విగ్రహం ఉంచండి:

మీ ఇంట్లో సంపద, శ్రేయస్సు ఉండాలంటే కుబేరుని విగ్రహాన్ని డబ్బు నిల్వ చేసే లాకర్ లేదా డ్రాయర్ లో ఉంచడం బెటర్. ఇలా చేయడం వల్ల డబ్బు పోగు పడుతుంది. కుబేరుడు ఐశ్వర్య కారకం. కాబట్టి డబ్బు పెరగాలంటే కుబేరుని విగ్రహం ఉంచండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.